అక్షరటుడే, వెబ్డెస్క్ : Fire Accident | వేసవి కాలం ఆరంభం అయిందని, అగ్ని ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. బాచుపల్లి అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఫర్నీచర్ దుకాణాలను బుధవారం హైడ్రా కమిషనర్ పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు.
Fire Accident | అప్రమత్తత అవసరం
ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర షార్టు సర్క్యూట్ జరిగి నిప్పు రవ్వలు రాలాయని.. అవి ఫర్నీచర్ దుకాణాలకు అంటుకుని మంటలంటాయని షాపుల నిర్వాహకులు తెలిపారు. పైన కరెంటు తీగలు వెళ్తున్నాయని.. అందులో ఒక తీగ తెగి మంటలంటుకున్నాయని మరో దుకాణ నిర్వాహకుడు తెలిపారు. వేసవి కాలం ఆరంభమైందని, అగ్ని ప్రమాదాల పట్ల ఎంతో అప్రమత్తత అవసరమని హైడ్రా కమిషనర్ సూచించారు.
Fire Accident | జాగ్రత్తలు తీసుకోవాలి..
అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉండే అవకాశాలపై అవగాహన ఉండాలని రంగనాథ్ అన్నారు. వాటి నివారణకు జాగ్రత్తలు తీసుకోవడం అందరి బాధ్యత అని చెప్పారు. తనిఖీలు చేసినంత మాత్రాన అగ్ని ప్రమాదాలను నియంత్రించలేమని.. ఫైర్ సేఫ్టీ నార్మ్స్ అందరూ పాటించినప్పుడే ఫలితాలుంటాయని పేర్కొన్నారు. తనిఖీలతో పాటు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పట్టించుకోని వారిపై చర్యలు తీసుకునే అధికారం కూడా హైడ్రాకు కట్టపెట్టాలని ప్రభుత్వానికి నివేదించామని ఈ సందర్భంగా తెలిపారు.
ఇది కూడా చదవండి..: Bachupally Fire Victims | బాచుపల్లి బాధితులకు అండగా ఉంటాం : ఎంపీ ఈటల

