అక్షరటుడే, కామారెడ్డి: Five People Arrest | పోలీసులు దాడులు చేపడుతున్నా పేకాట రాయుళ్ల తమ వ్యసనాన్ని మార్చుకోవడం లేదు. స్థావరాలను మార్చుతూ పేకాడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు పేకాడుతున్న వారిపై పకడ్బందీగా నిఘా పెడుతున్నారు.
Five People Arrest | మర్కల్ శివారులో..
తాజాగా పేకాడుతూ ఐదుగురు పోలీసులకు చిక్కిన ఘటన సదాశివనగర్ మండలం మర్కల్ శివారులో చోటుచేసుకుంది. మర్కల్ శివారులో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. పోలీసుల దాడుల్లో ఐదుగురు పేకాట రాయుళ్ల పట్టుబడ్డారు. వీరివద్ద నుంచి రూ.13,910 నగదు, 4 బైకులు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కఠిన చర్యలు
జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పోలీసులు తరచుగా దాడులు పేకాట స్థావరాలపై దాడులు చేస్తున్నారు. పేకాడుతున్న వారిని పట్టుకుని అరెస్ట్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Lingampet wrestling competitions | ఆకట్టుకున్న కుస్తీ పోటీలు

