అక్షరటుడే, వెబ్‌డెస్క్: Flights Parking Fee | దేశీయ విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం (Central Government) గుడ్ న్యూస్ చెప్పింది. కొంతకాలంగా నష్టాల్లో ఉన్న ఆయా సంస్థలకు ఊరట కలిగింది. దేశీయ విమానాల ల్యాండింగ్, పార్కింగ్ ఫీజులను 25 శాతం తగ్గించింది. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ విమానాశ్రయాలను ఆదేశించింది.
ఇరాన్ యుద్ధంతో ఎయిర్‌లైన్ సంస్థలు ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాయి. ఈ క్రమంలో దేశీయ విమానాల ల్యాండింగ్ (Aircraft landings), పార్కింగ్ ఛార్జీలను మూడు నెలల పాటు 25శాత మేర తగ్గించాలని భారత విమానాశ్రయ టారిఫ్ నియంత్రణ సంస్థ ప్రధాన విమానాశ్రయాలను ఆదేశించింది. ఎయిర్‌పోర్టులు విధించే కొన్ని రుసుములను హేతుబద్ధీకరించాలని ఇండిగో, ఎయిర్ ఇండియా (Air India) కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Flights Parking Fee | భారీగా నష్టాలు
ఇరాన్ యుద్ధంతో ఇంధన ధరలు పెరిగాయి. పలు దేశాలు గగనతలాలను మూసి వేశాయి. దీంతో ఇండిగో (IndiGo), ఎయిర్ ఇండియా నష్టాలు భారీగా పెరిగాయి. భారతీయ విమానాలు ఇప్పటికే పాకిస్థాన్ (Pakistan) మీదుగా ప్రయాణించకుండా ఆ దేశం ఆంక్షలు విధించింది. దీంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సి రావడంతో భారీగా ఇంధనం ఖర్చు అవుతోంది. ఈ క్రమంలో కేంద్రం ఆయా సంస్థలకు ఊరట కల్పించింది.
ఇది కూడా చదవండి..: India Advisory | ఇరాన్‌ను వెంటనే వీడండి.. భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
