Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Flood Water Management | వ‌ర‌ద నీరు చెరువులకు చేరేలా చర్యలు : హైడ్రా కమిషనర్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Flood Water Management | వ‌ర‌ద నీరు చెరువులకు చేరేలా చర్యలు : హైడ్రా కమిషనర్

హైదరాబాద్తెలంగాణ

Flood Water Management | వ‌ర‌ద నీరు చెరువులకు చేరేలా చర్యలు : హైడ్రా కమిషనర్

మాదాపూర్‌లోని సున్నం చెరువు, త‌మ్మిడికుంట ప‌రిస‌రాల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ ప‌రిశీలించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 6:26 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Flood Water Management

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Flood Water Management | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరదల నియంత్రణకు హైడ్రా (Hydraa) చర్యలు చేపట్టింది. వర్షాకాలం వచ్చిందంటే అనేక కాలనీలు జలమయం అవుతాయి. రోడ్లు చెరువులను తలపిస్తాయి. ఈ సమస్య పరిష్కారానికి హైడ్రా చెరువులను పునరుద్ధరిస్తోంది. నాలాలపై ఆక్రమణలను తొలగిస్తోంది.

Contents
  • Flood Water Management | మురుగు నీరు మళ్లింపు
    • Flood Water Management | త‌మ్మిడికుంటలో..

వరద నీరు చెరువులకు చేరేలా హైడ్రా ఏర్పాట్లు చేస్తోంది. ఇన్‌లెట్ల‌లోకి ఫీడ‌ర్ ఛాన‌ళ్ల ద్వారా వ‌ర‌ద నీరు వచ్చేలా వాటిని అభివృద్ధి చేస్తోంది. ఈ క్ర‌మంలో మాదాపూర్‌ (Madhapur)లోని సున్నం చెరువుతో పాటు త‌మ్మిడికుంట ప‌రిస‌రాల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ (Ranganath), సీఎంసీ క‌మిష‌న‌ర్ సృజ‌న సోమ‌వారం ప‌రిశీలించారు. గత రెండు రోజుల్లో హైడ్రా కమిషనర్​ ఈ చెరువులను రెండోసారి పరిశీలించడం గమనార్హం. సున్నం చెరువు పక్కన ఉన్న బోర‌బండ బ‌స్తీ, ఎన్ఆర్ఆర్ పురం నుంచి వ‌చ్చే వ‌ర‌ద నీరు ఇన్‌లెట్ల ద్వారా చెరువులోకి క‌లిసేలా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను ఆయన సమీక్షించారు.

Flood Water Management | మురుగు నీరు మళ్లింపు

మురుగు నీరు చెరువుల్లోకి వెళ్లకుండా మళ్లించాలని రంగనాథ్​ ఆదేశించారు. పైపుల‌ద్వారా కిందకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మాదాపూర్ – బోర‌బండ మీదుగా హైటెన్ష‌న్ వైర్ల కింద నుంచి వెళ్లే రోడ్డు విస్త‌ర‌ణ అంశాన్ని కూడా ప‌రిశీలించారు. చెరువులు నిండిన‌ప్పుడు ఔట్‌లెట్ల ద్వారా విడుద‌ల చేసిన నీరు వెళ్లేందుకు ఉద్దేశించిన కాలువ‌ల విస్త‌ర‌ణ‌పై చ‌ర్చించారు.

Flood Water Management | త‌మ్మిడికుంటలో..

భారీ వ‌ర్షం ప‌డితే కొండాపూర్‌, ఐటీ హ‌బ్ నుంచి వ‌చ్చే వ‌ర‌దతో శిల్పారామం, మెట‌ల్ చార్మినార్ ప‌రిస‌రాలు జ‌ల‌మ‌యం అవుతాయి. ఈ నీరు త‌మ్మిడికుంట‌కు చేరేలా అధికారులు ఇన్​లెట్​లను ఏర్పాటు చేశారు. వ‌ర‌ద ఇన్‌లెట్ల ద్వారా చెరువులోకి చేరేలా కాలువ‌ల అనుసంధానం చేయాలని కమిషనర్​ ఆదేశించారు. ఆయా చెరువుల్లో ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టాలన్నారు.

ఇది కూడా చదవండి : Lungs Transport Operation | బెంగళూరు నుంచి ఊపిరితిత్తులు.. గ్రీన్​ఛానెల్​ ఏర్పాటు చేసిన పోలీసులు

Anganwadi Breakfast Scheme | అంగన్​వాడీ చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం
BRS Leaders Meeting | కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ నేతల కీలక భేటీ
Telangana New Governor | నూతన గవర్నర్​కు స్వాగతం పలికిన సీఎం రేవంత్​రెడ్డి
Family Life Insurance Scheme | రాష్ట్రంలో కొత్త పథకం.. ప్రతి కుటుంబానికి జీవితబీమా : డిప్యూటీ సీఎం
Hyderabad Food Adulteration | కల్తీ మాఫియాపై ఉక్కుపాదం.. ప్రత్యేక బృందం ఏర్పాటు
TAGGED:Drainage Systemflood managementHyderabad Lakeshydra actionsLake Restorationurban flooding
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Hyundai Car Offers Hyundai Car Offers | రూ. 1.10 లక్షల వరకు ప్రయోజనాలు
Next Article Dog Bite | Dog Bite | కుక్కకాటుతో రెండేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?