అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Food Adulteration Raids | హైదరాబాద్ (Hyderabad) పోలీసులు ఆహార కల్తీపై కఠిన చర్యలు చేపడుతున్నారు. నిత్యం దాడులు చేస్తూ.. కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసేవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా కాటేదాన్‌లోని ఓ బేకరీపై దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లోని కటేదాన్ ప్రాంతంలో “మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీ” పేరుతో అక్రమంగా నడుస్తున్న ఒక ఆహార తయారీ యూనిట్‌పై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు దాడులు చేశారు. యూనిట్‌ను నిర్వహిస్తున్న అఫ్రిది అన్సారీ, యాసీన్, ఖత్రేషన్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు అపరిశుభ్ర వాతావరణంలో, కుళ్లిన గుడ్లు, సోడియం బెంజోయేట్, సార్బిక్ ఆమ్లం, PGPR ద్రవం వంటి ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి డోనట్ బన్స్, కేకులు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కల్తీ ఆహార పదార్థాలను అసలైన ఉత్పత్తులుగా విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తున్నారని తెలిపారు.
Food Adulteration Raids | కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం
టాస్క్‌ఫోర్స్ పోలీసులు (Taskforce Police) రాజేంద్రనగర్‌లోని డెక్కాన్ ట్రేడర్స్ గోదాములపై దాడులు చేశారు. అక్రమ కార్యకలాపాల్లో ప్రమేయం ఉన్నారన్న ఆరోపణలపై ముగ్గురు సోదరులు సోహైల్ చరణియా, రహీమ్ చరణియా, అమిత్ చరణియాలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తూ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వీరు ఆ పేస్ట్‌లో ఎసిటిక్ ఆమ్లం, కృత్రిమ రంగులు, “శాంటిక్ ఆమ్లం” (Santic acid), వెల్లుల్లి పొట్టు హానికర పదార్థాలను కలిపినట్లు గుర్తించారు. ఈ కల్తీ పేస్ట్‌ను నిందితులు హోల్‌సేల్ కిరాణా దుకాణాలు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ భారీ లాభాలు ఆర్జిస్తున్నారు. అధికారులు సుమారు 70 క్వింటాళ్ల అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఇతర రసాయన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
Food Adulteration Raids | నకిలీ కొబ్బరి పొడి..
కల్తీ మాఫియా చివరకు కొబ్బరి పొడిని వదలడం లేదు. బేగం బజార్ (Begum Bajar)లో ఒక అక్రమ కొబ్బరి పొడి తయారీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. నకౌల్ మారోటియా (31) అనే నిందితుడిని అరెస్టు చేశారు. సరైన లైసెన్సులు, బ్యాచ్ వివరాలు లేదా ఆహార భద్రతా ధృవీకరణ పత్రాలు ఏవీ లేకుండానే, నిందితుడు తక్కువ నాణ్యత గల కొబ్బరి పొడిని బ్రాండెడ్ లేబుళ్ల కింద రీప్యాకేజింగ్ చేస్తూ అక్రమంగా ఉత్పత్తి చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు 8,300 కిలోల కొబ్బరి పొడి, ప్యాకింగ్ మరియు తూకం యంత్రాలు, అలాగే ప్యాకింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం అంచనా విలువ ₹21 లక్షలు ఉంటుందని తెలిపారు.
దీనిని కూడా చదవండి : Chicken Shops Bandh | ఏప్రిల్1 నుంచి చికెన్ షాపులు బంద్!

