అక్షరటుడే, వెబ్‌డెస్క్: Food Adulteration Warning | ఆహార పదార్థాలను కల్తీ చేసే వారికి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarasimha) వార్నింగ్ ఇచ్చారు. కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఫుడ్ సేఫ్టీ అవేర్‌నెస్ వాకథాన్ సోమవారం హైదరాబాద్ (Hyderabad)లో నిర్వహించారు. మంత్రి రాజనర్సింహ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జలవిహార్ నుంచి ఐమ్యాక్స్ పక్కనున్న హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ వరకూ ఫుడ్ సేఫ్టీ అవేర్‌నెస్ వాకథాన్ (Food Safety Awareness Walkathon) ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫుడ్ సేఫ్టీ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఫుడ్ సేఫ్టీ శాఖ, పోలీస్ శాఖల సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా నిరంతర తనిఖీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రెండేళ్లలో 11,000కు పైగా తనిఖీలు నిర్వహించి, కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
Food Adulteration Warning | ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు
నాసిరకం, కల్తీ పదార్థాలతో ఆహారం తయారు చేసి అమ్ముతున్న హోటళ్లు, రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
ఫుడ్ సేఫ్టీ అమలు వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ఇందుకోసం కొత్తగా 24 మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్లను నియమించామన్నారు. 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ వాహనాలను రంగంలోకి దింపినట్లు వెల్లడించారు. నిజామాబాద్, హన్మకొండ, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో రూ.15 కోట్లతో 3 రీజినల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ (Regional Food Testing Laboratory)లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Food Adulteration Warning | అన్నింటా కల్తీ
ఉప్పు, పప్పులు, చింతపండు, చక్కెర, చాయిపత్తీ దేన్నీ వదలకుండా కల్తీ చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారని చెప్పారు. వీటిని తిన్న ప్రజలు జీర్ణకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని వెల్లడించారు. నాన్-కమ్యూనికబుల్ వ్యాధుల భారం పెరుగుతుండటానికి అనారోగ్యకర ఆహార అలవాట్లు ఒక ప్రధాన కారణమని చెప్పారు. ఫుడ్ సేఫ్టీ కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఆహారం కల్తీ చేసేవారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: Encroachment Drive | ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపు.. సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత
