అక్షరటుడే, వెబ్‌డెస్క్: Footpath Encroachments | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ట్రాఫిక్ రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టింది.
నగరంలో జనాభా పెరుగుతుండటంతో వాహనాల సంఖ్య సైతం పెరుగుతోంది. దీంతో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పాదచారుల కోసం నిర్మించిన ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురి అవుతున్నాయి. పలువురు వ్యాపారులు ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేస్తున్నారు. తమ దుకాణాల ముందు ఉన్న ఫుట్‌పాత్‌లను ఆక్రమించి సామగ్రి పెడుతున్నారు. దీంతో ఆక్రమణలు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Footpath Encroachments | జీహెచ్ఎంసీ నోటీసులు
ఫుట్‌పాత్ ఆక్రమణలు తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. ఇటీవల ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తామన్నారు. ఫుట్‌పాత్‌పై వ్యాపారాలు చేసే వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపుతామన్నారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించాలని జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ప్రతి శనివారం ఫుట్ పాత్‌పై ఆక్రమణల తొలగింపు కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపింది. నేటి నుంచే ఆక్రమణ తొలగింపు కార్యక్రమం చేపడుతామని GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.
ఇది కూడా చదవండి : Osmania Biscuits Adulteration | క్యాన్సర్ కారకాలతో ఉస్మానియా బిస్కెట్ల తయారీ

