అక్షరటుడే, వెబ్‌డెస్క్: Forbes India Billionaires | ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా 2026లో భారత్‌కు 3వ స్థానం లభించింది. 229 మంది భారతీయులు జాబితాలో చోటు దక్కించుకున్నారు. కొత్తగా 26 మంది ఎంట్రీ ఇచ్చారు. 33 ఏళ్ల అలఖ్ పాండే(ఫిజిక్స్‌వాలా సహ-వ్యవస్థాపకుడు) ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కారు. టాప్ 3లో ముఖేష్ అంబానీ (Mukesh Ambani), గౌతమ్ అదానీ, సావిత్రి జిందాల్ నిలిచారు.
ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల (Forbes World’s Billionaires) జాబితాలో భారత పౌరులలో అత్యంత ధనవంతుడిగా ముఖేష్ అంబానీ నిలిచారు. అంతేకాకుండా ఓ.పి. జిందాల్ గ్రూప్ అధినేత్రి సావిత్రి జిందాల్, 20 మంది భారతీయ మహిళా బిలియనీర్ల బృందానికి నాయకత్వం వహిస్తూ, మూడవ అత్యంత సంపన్న భారతీయురాలిగా నిలిచారు. దేశంలోని నాల్గవ అత్యంత ధనవంతుడు, ఉక్కు వ్యాపారవేత్త లక్ష్మీ మిట్టల్. ఈ సంవత్సరం టాప్ టెన్ జాబితాలో ఇటీవల పద్మభూషణ్ పురస్కారం అందుకున్న కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ చేరారు. పేమెంట్స్ యాప్ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ కూడా ఈ సంవత్సరం తిరిగి ఈ జాబితాలోకి వచ్చారు.
Forbes India Billionaires | యువ విద్యావేత్తకు..
భారతీయ విద్యావేత్త, ఎడ్‌టెక్ పారిశ్రామికవేత్త అలఖ్ పాండే ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా 2026లో చోటు సంపాదించారు. 33 ఏళ్ల అలఖ్, ఇంజనీరింగ్ కళాశాల చదువును మధ్యలోనే మధ్యలో వదిలేసి, 2014లో ఆన్‌లైన్‌లో ఫిజిక్స్ బోధించడం ప్రారంభించారు. అలఖ్ పాండే, ప్రతీక్ బూబ్ కలిసి 2020లో ‘ఫిజిక్స్‌వాలా’ అనే ఎడ్‌టెక్ సంస్థను స్థాపించారు. ఇది విద్యార్థులు వివిధ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి సహాయపడే కోర్సులను అందిస్తుంది. 229 మందితో భారత్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చైనా, అమెరికాల తర్వాత మూడవ స్థానంలో నిలిచింది.
Forbes India Billionaires | కొత్తవారు వీరే..
ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో కొత్తగా 26 మంది చేరారు. వారిలో మధుర్ బజాజ్ భార్య, కుముద్ బజాజ్, సుమారు 4.1 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఉన్నారు. చెన్నైకి చెందిన ఖజానా జ్యువెలరీ (Khazana Jewellery) యజమాని కిషోర్ జైన్ 2.2 బిలియన్ డాలర్ల నికర సంపదతో స్థానంలో ఉన్నారు. పెర్ప్లెక్సిటీ ఏఐ సహ వ్యవస్థాపకుడు అరవింద్ శ్రీనివాస్ కూడా 2.1 బిలియన్ డాలర్ల సంపదతో బిలియనీర్ల జాబితాలోకి ప్రవేశించారు.
ఇది కూడా చదవండి..: India Heatwave 2026 | ఇక భగభగలే.. ఈసారి మండే ఎండలు.. ఎన్ని డిగ్రీలంటే..

