Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Friend stabbing incident | డబ్బుల కోసం గొడవ.. స్నేహితుడిపై కత్తితో దాడి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Friend stabbing incident | డబ్బుల కోసం గొడవ.. స్నేహితుడిపై కత్తితో దాడి

క్రైం

Friend stabbing incident | డబ్బుల కోసం గొడవ.. స్నేహితుడిపై కత్తితో దాడి

డబ్బుల కోసం ఇద్దరు స్నేహితుల మధ్య మొదలైన గొడవ కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘటన హన్మకొండ జిల్లాలో చోటు చేసుకుంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 5, 2026 6:51 సా.
Srinivas Kolluri
13 గంటలు ago
Share
Friend stabbing incident

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Friend stabbing incident | డబ్బుల కోసం ఇద్దరు స్నేహితుల మధ్య మొదలైన గొడవ కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘటన హన్మకొండ (Hanmakonda) జిల్లాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.

డబ్బుల కోసం ఫ్రెండ్స్ మధ్య గొడవ జరిగింది. దీంతో మద్యం మత్తులో ఒక వ్యక్తిపై అతడి స్నేహితుడు కత్తితో దాడి చేశాడు. హన్మకొండ జిల్లా గోపాలపురంలో ఈ ఘటన జరిగింది. గోపాలపురం ప్రాంతానికి చెందిన రామ్ చరణ్, కార్తీక్ స్నేహితులు. వీరిద్దరి మధ్య రూ.3 లక్షలకు సంబంధించి కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఆ డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. గొడవ పెద్దది కావడంతో ఆవేశానికి లోనైన కార్తీక్ తన వద్ద ఉన్న కత్తితో రామ్ చరణ్‌పై దాడి చేశాడు.

Friend stabbing incident | తీవ్ర గాయాలు

దాడిలో రామ్ చరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని గమనించిన స్థానికులు వరంగల్‌లోని ఎంజీఎం (MGM) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కత్తిపోట్ల అనంతరం నిందితుడు కార్తీక్​ పరారు అయ్యాడు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి : Madhapur Accident | స్కూటీని ఢీకొని 5 కి.మీ. ఈడ్చుకెళ్లిన డీసీఎం.. మహిళ మృతి

Drunk Driving Penalties | డ్రంకన్​ డ్రైవ్​ కేసుల్లో ఇద్దరికి జైలు.. పలువురికి జరిమానా
Kamareddy Theft Arrest | పారిపోతున్న దొంగల పట్టివేత: క్రైంబీట్ సిబ్బందికి ఎస్పీ అభినందన
Threat Case Jail | బెదిరింపుల కేసులో ఒకరికి మూడేళ్ల జైలు..
Hyderabad suicide case | ఐదేళ్ల ప్రేమ.. పెళ్లయిన 50 రోజులకే యువతి ఆత్మహత్య
Car Accident Gandhari | అదుపు తప్పి కారు బోల్తా.. ఒకరికి గాయాలు
TAGGED:crime newsfriend disputeHanamkonda newsknife attackmoney conflicttelangana crimeWarangal news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Perini dance exams | Perini dance exams | పేరిణి నాట్య ప్రవేశిక పరీక్షల నిర్వహణ
Next Article Trump warns Iran Trump warns Iran | ‘హర్ముజ్’​ తెరవకపోతే దాడులు ఉధృతం.. ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?