Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gajwel Political Tension | గజ్వేల్​లో హైటెన్షన్​ .. సీఎం ఫొటో తొలగించిన బీఆర్​ఎస్​ నాయకులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Gajwel Political Tension | గజ్వేల్​లో హైటెన్షన్​ .. సీఎం ఫొటో తొలగించిన బీఆర్​ఎస్​ నాయకులు

తెలంగాణ

Gajwel Political Tension | గజ్వేల్​లో హైటెన్షన్​ .. సీఎం ఫొటో తొలగించిన బీఆర్​ఎస్​ నాయకులు

కేసీఆర్ క్యాంప్​ కార్యాలయంలో కాంగ్రెస్​ నేతలు సీఎం రేవంత్​రెడ్డి ఫొటో ఏర్పాటు చేశారు. బీఆర్​ఎస్​ నేతలు దానిని తొలగించి కేసీఆర్​ ఫొటో పెట్టారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 4, 2026 7:06 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Gajwel Political Tension

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gajwel Political Tension | సిద్దిపేట (Siddipet) జిల్లా గజ్వేల్​లో ఉద్రిక్తత కొనసాగుతోంది. సీఎం క్యాంప్​ ఆఫీస్​లో కాంగ్రెస్​ నాయకులు పెట్టిన సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఫొటోను బీఆర్​ఎస్​ నాయకులు తొలగించారు.

గజ్వేల్​లోని ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​పై శనివారం ఉదయం దాడి జరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్​ శ్రేణులు పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి తరలి వచ్చాయి. కార్యాలయంలో మాజీ సీఎం, ఎమ్మెల్యే కేసీఆర్​ ఫొటోను తొలగించి సీఎం రేవంత్​రెడ్డి ఫొటోను నాయకులు పెట్టారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంపై దాడి చోటు చేసుకుంది. క్యాంప్​ ఆఫీస్​లోని కిటికీ అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

Gajwel Political Tension | కేసీఆర్​ ఫొటో ఏర్పాటు

క్యాంప్​ ఆఫీస్​పై తాము దాడి చేయలేదని కాంగ్రెస్​ నాయకులు అంటున్నారు. అయితే అధికార పార్టీ నేతలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ దాడికి పాల్పడ్డారని బీఆర్​ఎస్​ ఆరోపిస్తోంది. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, నాయకులు ఈ దాడిని ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. మరోవైపు గజ్వేల్​ బీఆర్​ఎస్​ నాయకులు ఒంటేరు ప్రతాప్​రెడ్డి ఆధ్వర్యంలో క్యాంప్​ ఆఫీస్​కు ర్యాలీగా వెళ్లారు. కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో తొలగించి కేసీఆర్ ఫొటో (KCR Photo) ఏర్పాటు చేశారు. క్యాంప్ ఆఫీస్​పై దాడి చేసిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

గజ్వేల్ కేసీఆర్ క్యాంప్ ఆఫీసులో పెట్టిన రేవంత్ రెడ్డి ఫోటో తొలగించిన బీఆర్ఎస్ సీనియర్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి 🔥🔥 pic.twitter.com/p398t3PAud

— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) April 4, 2026

ఇది కూడా చదవండి : WhatsApp Impersonation Fraud | బడా కంపెనీలే లక్ష్యంగా సైబర్​ నేరగాళ్ల మోసం

Hyderabad Gas Shortage | ఆ వంటలు చేయలేం.. గ్యాస్​ కొరతతో హాస్టళ్ల నిర్ణయం
Middle East War | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ‘హాహాకారాలు.. ఆర్తనాదాలు..’
High Court Zone 2 | హైకోర్టు జోన్-2 భవనం పనులకు శంకుస్థాపన
Eatala Rajender Comments | పార్టీ మార్పు ప్రచారంపై ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు
Face Recognition Schemes | ఇకపై అన్ని పథకాలు ఫేస్ రికగ్నిషన్‌తోనే.. రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం
TAGGED:BRS vs CongressCM photo controversyGajwel newspolitical clashesSiddipet DistrictTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Armoor Peace Rally | Armoor Peace Rally | ఆర్మూర్​లో ఘనంగా శాంతి ర్యాలీ
Next Article Jana Sena MLA Jana Sena MLA | జనసేన ఎమ్మెల్యేపై మనీ లాండరింగ్ ఆరోపణలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?