అక్షరటుడే, భీమ్గల్ (వేల్పూర్): గ్రామ ప్రజల ఆరోగ్యం, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వేల్పూర్ గ్రామ పంచాయతీ (Velpur Gram Panchayat) పాలకవర్గం శుక్రవారం మూడు కీలక తీర్మానాలు చేసింది. సర్పంచ్ మొండి అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
Ganja Ban Velpur | గంజాయి విక్రయించినా.. మద్యం తాగినా.. శ్రీనివాస్.. టెంపరరీ డీఎంఈ నుంచి ఉత్వర్తులు చేశారు.
గ్రామంలో గంజాయి విక్రయించినా, తాగినా కఠిన చర్యలు తీసుకుంటామని సర్పంచ్ హెచ్చరించారు. గంజాయిపై సమాచారం అందించిన వారికి రూ.10 వేల బహుమతి అందజేస్తామని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. అదేవిధంగా, 21ఏళ్ల లోపు యువతకు సిగరెట్లు, గుట్కా, మద్యం విక్రయించే షాప్ యజమానులకు రూ. 10వేల జరిమానా విధించాలని తీర్మానించారు. దీనిపై సమాచారం ఇచ్చిన వారికి రూ. 5వేల రివార్డు ఇవ్వనున్నారు.
Ganja Ban Velpur | పిల్లల ఆరోగ్యం దృష్ట్యా..
పిల్లల ఆరోగ్యం దృష్ట్యా గ్రామంలోకి ఐస్‌క్రీమ్ బండ్లు (Ice Cream Carts) రాకుండా నిషేధం విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ.5వేల జరిమానా తప్పదని స్పష్టం చేశారు. ‘మన ఊరు-మన బాధ్యత’గా ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేతరి బాలయ్య, కార్యదర్శి వినోద్, వార్డు సభ్యులు నరేష్, నాగేష్, ప్రవీణ్, లక్ష్మి, రాజమణి, రవి, స్వప్న, మంజుల, శివ, శ్రీకాంత్, కారోబార్ రాజేశ్వర్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Armoor House Burglary | పట్టపగలే ఇల్లు దోచేశారు.. భారీగా బంగారం చోరీ..
