అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gas Burner Cleaning | వంటగదిలో మనం నిత్యం ఉపయోగించే అత్యంత ముఖ్యమైన పరికరం గ్యాస్ స్టవ్. వంట చేసేటప్పుడు పాలు, నూనె లేదా కూరలు పొంగి బర్నర్లపై పడటం సహజం. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే, జిడ్డు పేరుకుపోయి బర్నర్ రంధ్రాలు మూసుకుపోతాయి. ఫలితంగా మంట సరిగ్గా రాక గ్యాస్ వృథా అవుతుంది. ఈ రోజుల్లో పెరుగుతున్న గ్యాస్ ధరలను, కొరతను దృష్టిలో ఉంచుకుంటే.. బర్నర్లను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల గ్యాస్‌ను ఆదా చేయవచ్చు. బర్నర్లను కొత్తవాటిలా మార్చే కొన్ని సింపుల్ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:
Gas Burner Cleaning | బేకింగ్ సోడా – నిమ్మరసం:
ఒక పాత్రలో గోరువెచ్చని నీటిని తీసుకుని, అందులో రెండు మూడు స్పూన్ల బేకింగ్ సోడా, ఒక నిమ్మకాయ రసాన్ని కలపండి. ఈ మిశ్రమంలో బర్నర్లను కనీసం గంట పాటు నానబెట్టండి. ఆ తర్వాత పాత టూత్ బ్రష్‌తో మెల్లగా రుద్దితే, మొండి జిడ్డు కూడా సులభంగా వదిలిపోతుంది.
Gas Burner Cleaning | వెనిగర్ స్ప్రే:
నీరు, తెల్ల వెనిగర్ Vinegar ను సమాన భాగాలుగా తీసుకుని ఒక స్ప్రే బాటిల్‌లో నింపండి. దీన్ని బర్నర్లపై చల్లి 20 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. తర్వాత స్క్రబ్బర్‌తో తోమితే బర్నర్ మెరుస్తుంది. ఇది జిడ్డును తొలగించడమే కాకుండా, మంట సక్రమంగా వచ్చేలా చేస్తుంది.
డిష్ వాష్ లిక్విడ్:
గోరువెచ్చని నీటిలో కొంచెం డిష్ వాషింగ్ సోప్ వేసి బాగా కలపండి. బర్నర్లను ఈ ద్రావణంలో ఒక అరగంట నానబెడితే, జిడ్డు పట్టిన మరకలు సులభంగా వదిలిపోతాయి. ఆ తర్వాత స్క్రబ్బర్‌తో శుభ్రం చేస్తే బర్నర్లు కొత్తగా మారుతాయి.
వెనిగర్, బేకింగ్ సోడా పవర్:
ఎక్కువగా పేరుకుపోయిన మురికిని వదిలించడానికి ఇది బెస్ట్ పద్ధతి. నీరు, వెనిగర్ కలిపిన ద్రావణంలో బర్నర్లను రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే వాటిపై కొద్దిగా బేకింగ్ సోడా చల్లి బ్రష్‌తో క్లీన్ చేయండి. దీనివల్ల బర్నర్లు లోపలి నుంచి కూడా శుభ్రపడతాయి.
నిమ్మకాయ – ఉప్పు:
ఇది చాలా వేగవంతమైన పద్ధతి. నిమ్మకాయను సగానికి కోసి, దానిపై కొంచెం ఉప్పు చల్లి, బర్నర్లను బాగా రుద్దండి. ఇది బర్నర్ పైనున్న జిడ్డును, రంధ్రాల్లో పేరుకుపోయిన డస్ట్‌ను తొలగిస్తుంది. మంట నీలంగా, బలంగా రావడానికి ఇది ఎంతో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: Sleeping Direction Vastu | ఈ దిశలో తల పెట్టి పడుకుంటున్నారా.. అయితే అనారోగ్యం తప్పదు!

