అక్షరటుడే, బాన్సువాడ: Gas Cylinder Black Market | పట్టణంలో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా జోరుగా సాగుతున్నట్లు (civil supplies negligence) ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క సిలిండర్‌ను రూ. 2,500కి విక్రయిస్తూ, వినియోగదారులను మోసం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
Gas Cylinder Black Market | సిలిండర్ల సీల్స్ తొలగించి..
కొంతమంది గ్యాస్ సిలిండర్ల సీల్స్‌ను అక్రమంగా (illegal gas refilling) తొలగించి, గ్యాస్‌ను ఇతర ఖాళీ సిలిండర్లలో సగం మేర నింపి (gas cylinder fraud) విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఖాళీ సిలిండర్లను కూడా పూర్తి సిలిండర్లుగా (black marketing LPG) చూపిస్తూ ఈ దందా కొనసాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలో (Gas Problems) సోమవారం గ్యాస్ సిలిండర్ సీల్ తీసి ఖాళీ సిలిండర్‌లో గ్యాస్ నింపుతున్న సమయంలో స్థానికులు గమనించి ఆటోను వెంబడించారు. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ ప్రమాదానికి గురై నడిరోడ్డుపై వాహనాన్ని వదిలి పారిపోయాడు.
Gas Cylinder Black Market | పోలీసులకు సమాచారం..
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం (banswada news) అందించగా.. వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆటోను స్వాధీనం చేసుకుని (cylinder seizure) పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గ్యాస్ సిలిండర్లు నిజాంసాగర్ ప్రాంతం నుంచి బాన్సువాడకు అక్రమంగా తరలించి విక్రయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. సివిల్ సప్లయ్స్ అధికారులపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ అక్రమ వ్యాపారం కొనసాగుతున్నప్పటికీ, అధికారులు కేవలం నామమాత్ర తనిఖీలకే పరిమితమవుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు వెంటనే కఠినచర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Trump Iran Announcement | అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన.. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై ఐదు రోజుల పాటు దాడులు వాయిదా

