అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gas Cylinder Booking | కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును 45 రోజులకు పొడిగించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ సరఫరా (Gas Supply) నిలిచిపోయిన విషయం తెలిసిందే. కేంద్రం ఇప్పటికే వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలు అమలు చేస్తోంది. దీంతో అనేక హోటళ్లు మూతపడగా.. హాస్టళ్లు, ఆలయాల్లో సైతం ఇబ్బందులు నెలకొన్నాయి. కొన్ని హోటళ్లలో కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని 21 నుంచి 25 రోజులకు పెంచింది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో దానిని 45 రోజులకు పొడిగించింది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం 25 రోజులే ఉండనుంది.
Gas Cylinder Booking | అధిక డిమాండ్‌తో..
గ్యాస్ కొరత (Gas Shortage) భారత్‌లో ఎక్కువగా లేదు. అయితే సంక్షోభం వస్తుందనే వార్తలతో ప్రజలు అధిక మొత్తంలో గ్యాస్ సిలిండర్లను ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. ఎక్కడ గ్యాస్ దొరకదేమోననే భయంతో నిత్యం గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. మరోవైపు కొంతమంది సిలిండర్లను ఇతరులపై పేరుపై బుక్ చేసి బ్లాక్ మార్కెట్ (Black Market)కు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం బుకింగ్ గడువును మరోసారి పెంచింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో వంట గ్యాస్ డిమాండ్ పెరుగుతున్నందున కేంద్రం ఈ చర్యలు చేపట్టింది.
ఇది కూడా చదవండి..: Gas Shortage Ayodhya | గ్యాస్ కొరతతో అయోధ్యలో నిలిచిన ప్రసాదం పంపిణీ

