Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gas Cylinder Shortage | గ్యాస్​ కొరత.. ఏజెన్సీల వద్ద ప్రజల బారులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Gas Cylinder Shortage | గ్యాస్​ కొరత.. ఏజెన్సీల వద్ద ప్రజల బారులు

తెలంగాణతాజా వార్తలు

Gas Cylinder Shortage | గ్యాస్​ కొరత.. ఏజెన్సీల వద్ద ప్రజల బారులు

గ్యాస్​ సిలిండర్ల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 13, 2026 12:55 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 వారాలు ago
Share
Gas Cylinder Shortage

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gas Cylinder Shortage | ఓ వైపు కేంద్ర ప్రభుత్వం (Central Government) దేశంలో గ్యాస్​ కొరత లేదని చెబుతోంది. అయినా సరఫరా సక్రమంగా కాకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్​ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు.

Contents
  • Gas Cylinder Shortage | సంగారెడ్డి జిల్లాలో ఆందోళన
    • Gas Cylinder Shortage | హోటళ్లలో తనిఖీలు
      • Gas Cylinder Shortage | వదంతులు నమ్మొద్దు

తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల గ్యాస్‌ సిలిండర్ల కొరత నెలకొంది. .. విజయవాడ (Vijayawada) లో గ్యాస్‌ కోసం ఏజెన్సీల ముందు వినియోగదారులు బారులు తీరారు. కస్టమర్లు బుక్‌ చేయకుండానే చేసినట్లు మెసేజ్‌లు వస్తున్నాయి. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఆ మెసేజ్‌లు చూసుకుని ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నిస్తే.. తమకు సంబంధం లేదని చెబుతున్నారు. అయితే సిలిండర్లు బుక్ చేసి బ్లాక్‌లో అమ్ముతున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

Gas Cylinder Shortage | సంగారెడ్డి జిల్లాలో ఆందోళన

సంగారెడ్డి జిల్లా (Sangareddy District) పటాన్‌చెరు హెచ్‌పీ గ్యాస్ గోదాం వద్ద గ్యాస్ వినియోగదారుల ఆందోళన చేశారు. గ్యాస్ ఆన్‌లైన్‌లో బుక్ కావడం లేదని, ఓటీపీలు రావట్లేదని, ఒకవేళ బుక్ అయినా కూడా సరఫరా చేయట్లేదని నిరసన తెలిపారు. కాగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్​ దేశాల నుంచి గ్యాస్​ రవాణా నిలిచిపోయింది. ఈ క్రమంలో దేశంలో సంక్షోభం రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కమర్షియల్​ సిలిండర్లపై ఆంక్షలు విధించింది. అయితే కొందరు డొమెస్టిక్​ సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్​ మార్కెట్​కు తరలిస్తున్నారు. దీంతో ప్రజలు నష్టపోతున్నారు.

Gas Cylinder Shortage | హోటళ్లలో తనిఖీలు

రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లలో సివిల్​ సప్లయ్స్​ అధికారులు (Civil Supplies Officials) తనిఖీలు చేపడుతున్నారు. గ్యాస్​ సిలిండర్ల కొరత నేపథ్యంలో హోటళ్లలో డొమెస్టిక్​ సిలిండర్లు వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. జగిత్యాల జిల్లాలో కమర్షియల్​కు బదులు, డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్న పలు హోటల్స్, రెస్టారెంట్స్​పై అధికారులు చర్యలు తీసుకున్నారు. కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Gas Cylinder Shortage | వదంతులు నమ్మొద్దు

ఇండియన్ ఆయిల్ (Indian Oil) పెట్రోల్ బంకుల్లో ఆయిల్ సప్లైకి ఎలాంటి ఇబ్బంది లేదని సంస్థ ప్రకటించింది. అన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ యథావిధిగా సప్లై చేస్తున్నామని తెలిపింది. ఆయిల్ కొరత ఉందనే రూమర్స్ నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. కాగా ఆయిల్​ కొరత ఉందంటూ ప్రచారం కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున పెట్రోల్​ బంక్​లకు క్యూ కడుతున్నారు. ట్యాంక్​లు ఫుల్​ చేయించుకుంటున్నారు. కొందరు డబ్బాల్లో పెట్రోల్​, డీజిల్​ నింపుకొని ఇళ్లకు తీసుకు వెళ్తున్నారు.

ఇది కూడా చదవండి..: Road Accident on NH44 | జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. ట్రావెల్స్​ బస్సు బోల్తా.. నలుగురి దుర్మరణం

Junk Food Cravings | జంక్ ఫుడ్ తింటున్నారా.. అయితే ఈ డేంజర్ బెల్స్ మీకోసమే!
Sircilla Weavers Dues | నేత కార్మికుల విద్యుత్​ బకాయిలు రద్దు చేయాలి : కేటీఆర్​
Nizamabad fire accident | నగరంలో భారీ అగ్నిప్రమాదం.. కాలనీవాసుల భయాందోళన
March 11 Gold Prices | ఒక్క రోజులోనే రూ.700 ఎగ‌బాకిన బంగారం ధ‌ర‌.. వెండి ఏకంగా రూ.10 వేల హైక్​
Midday Meal Fish | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. మధ్యాహ్న భోజనంలో చేపల కర్రీ
TAGGED:civil supplies inspectionsdomestic lpg crisisGas Cylinder Shortagelpg black market indialpg supply issue indiapatancheru hp gas protestvijayawada gas shortage
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Domestic Cylinders Seized Domestic Cylinders Seized | హోటల్​లో డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసిన అధికారులు
Next Article Bus Accident Parrots Rescued Bus Accident Parrots Rescued | బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్టీఏ అధికారుల తనిఖీలు.. చిలుకలను కాపాడిన వైనం..
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?