అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Gas Cylinder Shortage | నగరంలో గ్యాస్ కొరత (Gas shortage) వినియోగదారులను వేధిస్తోంది. అయితే ఆయా ఏజెన్సీల నిర్వాహకులు కృత్రిమ కొరత సృష్టిస్తూ వినియోగదారులను ఇబ్బందులు పెడుతున్నట్లుగా ఆరోపణలున్నాయి.
Gas Cylinder Shortage | నగరంలోని తిలక్గార్డెన్ చౌరస్తా వద్ద..
నగరంలోని తిలక్గార్డెన్ చౌరస్తా వద్ద ఓ గ్యాస్ ఏజెన్సీ (Gas Agency) ఎదుట బుధవారం ఉదయం వినియోగదారులు ధర్నా చేపట్టారు. ఉదయాన్నే గ్యాస్ ఏజెన్సీకి వచ్చిన తమకు సిలిండర్ల లేవని నిర్వాహకులు సమాధానం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డొమెస్టిక్ సిలిండర్లను (Domestic cylinders) వ్యాపారస్తులకు గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని వారు ఆరోపించారు. సీపీ కార్యాలయానికి (CP Office) కూతవేటు దూరంలో నడిరోడ్డుపై గ్యాస్ వినియోగదారులు ధర్నా చేపట్టడంతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
ఇది కూడా చదవండి..: Bodhan Municipal Budget | బోధన్ మున్సిపల్ బడ్జెట్ రూ.49.06 కోట్లు.. ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్
