Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gas Price Impact | గ్యాస్​ కొరత బూచీ.. ధరలు పెంచేస్తున్న హోటల్​, హాస్టల్​ నిర్వాహకులు!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Gas Price Impact | గ్యాస్​ కొరత బూచీ.. ధరలు పెంచేస్తున్న హోటల్​, హాస్టల్​ నిర్వాహకులు!

తెలంగాణతాజా వార్తలుహైదరాబాద్

Gas Price Impact | గ్యాస్​ కొరత బూచీ.. ధరలు పెంచేస్తున్న హోటల్​, హాస్టల్​ నిర్వాహకులు!

గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సర్కారు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని, వినియోగదారుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు విన్నవిస్తున్నారు.

Naresh chandan
Last updated: మార్చి 13, 2026 10:46 సా.
Naresh chandan
2 వారాలు ago
Share
akshara gas

అక్షరటుడే, హైదరాబాద్: Gas Price Impact | ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు సాధారణ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్లను అస్థిరతకు గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావం భారత్​పైనా పడుతోంది.

Contents
  • Gas Price Impact | క్షేత్రస్థాయి పర్యవేక్షణ ఏది?
    • Gas Price Impact | విద్యార్థుల ముక్కు పిండి వసూలు..
      • ఎల్పీజీ వినియోగం

చమురు ధరలు పెరిగే అవకాశం ఉందనే భయంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయేమోనని సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెరుగుతున్న ధరల భారాన్ని మోయలేక మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలు భవిష్యత్తు గురించి చింతిస్తున్నారు.

Gas Price Impact | క్షేత్రస్థాయి పర్యవేక్షణ ఏది?

గ్యాస్​ కొరత లేదని తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలోని భారాస సర్కారు హామీ ఇస్తున్నా.. క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేకపోవడంతో గ్యాస్​ ఏజెన్సీ నిర్వాహకులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఈ ప్రభావం ఇతర మార్కెట్​ రంగాలపై పడుతోంది. దీంతో అడ్డగోలుగా ధరలు పెంచేస్తున్నారు. ముఖ్యంగా హెటళ్లు, హాస్టల్​ నిర్వాహకులు ఇష్టారితిన వ్యవహరిస్తున్నారు.

Gas Price Impact | విద్యార్థుల ముక్కు పిండి వసూలు..

గ్యాస్​ కొరత, చమురు ధరల పెంపు బూచీ చూపుతూ.. విద్యార్థులను హాస్టల్​ నిర్వాహకులు పీడిస్తున్నారు. విద్యార్థుల నుంచి ముక్కు పిండి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి అదనంగా రూ. 1  వెయ్యి నుంచి రూ. 2 వేల వరకు వసూలు చేస్తుండటం గమనార్హం.

ఈ చర్య వల్ల విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ కొరత ఉందని చెప్పి వసతి గృహాల ఫీజులు పెంచడం సరైంది కాదని వాపోతున్నారు.

ఎల్పీజీ వినియోగం

గత కొన్నేళ్లుగా తెలంగాణలో ఎల్పీజీ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం రాష్ట్రంలో సుమారు 1.35 కోట్లకు పైగా గృహ ఎల్పీజీ వినియోగదారులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,200కు పైగా గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. రోజువారీగా లక్షల సంఖ్యలో గ్యాస్​ సిలిండర్లు సరఫరా అవుతున్నాయి.

సగటున రాష్ట్రంలో నిత్యం 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు ఎల్పీజీ సిలిండర్లు వినియోగిస్తున్నట్లు అంచనా. గృహ వినియోగంతో పాటు రెస్టారెంట్లు, హోటళ్లు, చిన్న పరిశ్రమలు, హాస్టళ్లు పెద్ద మొత్తంలో గ్యాస్‌ సిలిండర్లను వినియోగిస్తున్నాయి.

ప్రధాన నగరాలైన Hyderabad, Nizamabad , Warangal, Karimnagar వంటి ప్రాంతాల్లో గ్యాస్​ వినియోగం మరింత ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. నగరాల్లో పెరుగుతున్న జనాభా, హోటల్ వ్యాపారం, హాస్టల్ వ్యవస్థల వల్ల గ్యాస్ వినియోగం పెరుగుతోంది.

Global Markets Mixed | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Hyderabad Traffic Restrictions | వాహనదారులకు అలెర్ట్​.. రేపు హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు
March 18 Horoscope | ఉద్యోగ యోగం.. ఈ రాశుల వారికి మెరుగుపడనున్న ఆర్థిక స్థితి!
New DGP Selection | కొత్త డీజీపీ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు.. రేసులో వీరే..
Mar 06 Pre Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
TAGGED:cost of living crisiseconomic impact fuel pricesfuel price inflationgas price impactglobal oil price effecthostel fee hike studentslpg price rise indiaoil price impact india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article ASHA Workers Demand | ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి : సీఐటీయూ డిమాండ్ ASHA Workers Demand | ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి : సీఐటీయూ డిమాండ్
Next Article Oman Drone Attack | ఒమన్​పై డ్రోన్​​ దాడి.. ఇద్దరు భారతీయుల దుర్మరణం Oman Drone Attack | ఒమన్​పై డ్రోన్​​ దాడి.. ఇద్దరు భారతీయుల దుర్మరణం
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?