అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gas Shortage Ayodhya | గ్యాస్ కొరత ఎఫెక్ట్ దేశంలోని ప్రముఖ ఆలయాలపై సైతం పడింది. నిత్యం వేలాది మంది భక్తులు దర్శనం చేసుకునే అయోధ్యలో ప్రసాదం పంపిణీని నిర్వాహకులు నిలిపివేశారు.
అయోధ్య బాలరాముడిని (Ayodhya Balarama) నిత్య అనేక మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామి వారి ప్రసాదం రామ్ రసోయి ఎంతో భక్తితో ఆరగిస్తారు. నిత్యం 20 వేల మందికి అక్కడ భోజనం పెడతారు. అయితే గ్యాస్ కొరత కారణంగా రామ్ రసోయి నిలిచిపోయినట్లు ఆలయ నిర్వాహకులు బోర్డు పెట్టారు. ప్రసాదం పంపిణీని పూర్తిగా మూసి వేయలేదన్నారు. ఉదయం పూట ప్రసాద వితరణ కొనసాగుతుందని, సాయంత్రం పూట మాత్రం మూసివేస్తామని ప్రకటించారు. కట్టెల పొయ్యి, ఎలక్ట్రిక్ కుక్కర్లు వినియోగించే ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Gas Shortage Ayodhya | కాశీలో..
కాశీలో సైతం గ్యాస్ కొరతతో ప్రసాదంగా పెట్టే భోజనంలో రెండు కూరలకు బదులు ఒకటే కూర వడ్డిస్తున్నారు. సేమ్యాతో చేసే పదార్థాలను తొలగించారు. కర్ణాటక (Karnataka)లో మఠాల ఆధ్వర్యంలో నడిచే అనేక దేవాలయాల్లో ఎల్పీజీ కొరతతో భోజనాలు, ప్రసాద వితరణలు ఆపేశారు. షిర్డిలో ప్రస్తుతం 15 రోజులకు సరిపడ ఎల్పీజీ నిల్వలు ఉన్నట్టు ఆలయ ట్రస్ట్ తెలిపింది. దీంతో ప్రసాద వితరణ, అన్నదానం కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
Gas Shortage Ayodhya | చెన్నైలో బారులు
చెన్నైలో పెట్రోల్ బంకులకు వాహనదారులు క్యూ కట్టారు. వేలచెరి, టీనగర్, అన్నానగర్ సహా పలు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో బారులు తీరారు. పెట్రోల్, డీజిల్ కొరత లేదన్నా వినిపించుకోవడం లేదు. ఎక్కడ ఇంధనం దొరకదేమోననే భయంతో ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. కొంత మంది డబ్బాల్లో నింపుకొని వెళ్తున్నారు. అవసరం కంటే ఎక్కువగా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తుండటంతో పలు ప్రాంతాల్లో బంక్‌ల్లో నో స్టాక్ బోర్డు దర్శనం ఇస్తోంది. అయితే దేశంలో చమురు కొరత లేదని కేంద్రం స్పష్టం చేసింది.
Gas Shortage Ayodhya | గ్యాస్ కోసం..
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గ్యాస్ కోసం ప్రజలు పరుగులు పెడుతున్నారు. అదనపు సిలిండర్లు ఉన్నవారు ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. డెలివరీ చేస్తారో లేదోనని నేరుగా ఏజెన్సీల వద్దకు వెళ్తున్నారు. నిజామాబాద్‌లోని గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరారు. యుద్ధ ప్రభావంతో కమర్షియల్ సిలెండర్ల సరఫరా నిలిచిపోయింది. దీంతో హోటల్స్, టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్ లకు సిలిండర్లు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అయితే ఎక్కడ డొమెస్టిక్ సిలిండర్ల (Domestic cylinders) కొతర వస్తుందేమోనన్న భయంతో ప్రజలు ముందుగానే గ్యాస్ తెచ్చుకుంటున్నారు. దీంతో కొరత ఏర్పడుతోంది.
ఇది కూడా చదవండి..: Farooq Abdullah Attack | ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం.. జెడ్ ప్లస్ భద్రతతో త్రుటిలో తప్పిన ప్రమాదం

