Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gas Shortage Protests | గ్యాస్​ కొరతపై ప్రతిపక్షాల ఆందోళన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Gas Shortage Protests | గ్యాస్​ కొరతపై ప్రతిపక్షాల ఆందోళన

జాతీయంతాజా వార్తలు

Gas Shortage Protests | గ్యాస్​ కొరతపై ప్రతిపక్షాల ఆందోళన

గ్యాస్​ కొరతపై ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్​ ఎదుట నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 12, 2026 12:24 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Gas Shortage Protests

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gas Shortage Protests | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో గ్యాస్​ సంక్షోభం తలెత్తింది. ఇప్పటికే వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిచిపోగా.. డొమెస్టిక్​ గ్యాస్​ కొరత (Domestic gas shortage) సైతం నెలకొంటుంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో గ్యాస్​ కొరతపై పార్లమెంట్ ముందు ప్రతిపక్షాలు గురువారం ఆందోళన నిర్వహించాయి.

Contents
  • Gas Shortage Protests | తక్షణం పరిష్కరించాలి
    • Gas Shortage Protests | చర్చ పెట్టాలి

గ్యాస్ సంక్షోభానికి నిరసనగా ప్లకార్డులు పట్టుకుని ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపారు. లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ (Rahul Gandhi), కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గే (Mallikarjun Kharge), ఆయా పార్టీల ఎంపీలు నిరసనలో పాల్గొన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్​ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా LPG కొరతతో ప్రజలు బారులు తీరుతున్నారని చెప్పారు. కోట్లాది మంది సామాన్య పౌరులు ఆహార భద్రతా సంక్షోభం వైపు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Gas Shortage Protests | తక్షణం పరిష్కరించాలి

గ్యాస్​ కొరతతో అనేక హోటళ్లు మూత పడ్డాయని వేణుగోపాల్ పేర్కొన్నారు. ప్రజలలో భయాందోళనలు వ్యాపిస్తున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి దీనిని జరగకుండా నిరోధించడంలో పూర్తిగా నిస్సహాయంగా ఉన్నారని విమర్శించారు. ఈ సంక్షోభానికి తక్షణ పరిష్కారం చూపాలని డిమాండ్​ చేశారు. ఈ ప్రభుత్వ అసమర్థతను బహిర్గతం చేయడానికి ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటులో నిరసన తెలిపారన్నారు.

Gas Shortage Protests | చర్చ పెట్టాలి

తెలంగాణ కాంగ్రెస్​ (Telangana Congress) ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి మాట్లాడుతూ.. LPG సిలిండర్ కొరతపై పార్లమెంట్​లో చర్చ పెట్టాలని డిమాండ్​ చేశారు. దేశ ప్రజలు సిలిండర్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) ఏది చెబితే మోదీ అదే వింటున్నారని ఆరోపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశం ఇప్పటివరకు యుద్ధంపై ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి ఉందన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Rythu DISCOM | ఇక మూడో డిస్కం.. ‘తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్’కు ఆమోదం

Fuel Shortage India | ఇంధన యుద్ధం.. దేశంలో పెట్రోల్​–డీజిల్​ కొరత.. బంకుల్లో వాహనదారుల బారులు!
Jal Jeevan Mission Extension | కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు.. జల్ జీవన్ మిషన్‌ పొడిగింపు..
Stock Market Relief Rally | స్టాక్ మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీ.. లాభాల బాటలో ప్రధాన సూచీలు
India Oil Reserves | ఆయిల్ నిల్వలపై కేంద్రం క్లారిటీ
Okha Tirupati Express | ఓఖా–తిరుపతి వీక్లీ ఎక్స్​ప్రెస్​లో మార్పులు
TAGGED:Domestic gas shortageGas Shortage ProtestsMallikarjun KhargeRahul GandhiTelangana CongressUS President Trump
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Chandrababu Naidu Ratings Chandrababu Naidu Ratings | మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా రేటింగ్స్
Next Article Lokesh Capgemini Meeting Lokesh Capgemini Meeting | క్యాప్​ జెమినీ సీఈవోతో ఏపీ మంత్రి లోకేష్​ భేటీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?