Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gautam Kumar Corruption Case | పోలీస్ బాస్ అవినీతి.. ఇంట్లో ప‌ని చేసే పని మనిషి కోసం ఏకంగా థార్ కారు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Gautam Kumar Corruption Case | పోలీస్ బాస్ అవినీతి.. ఇంట్లో ప‌ని చేసే పని మనిషి కోసం ఏకంగా థార్ కారు..

జాతీయం

Gautam Kumar Corruption Case | పోలీస్ బాస్ అవినీతి.. ఇంట్లో ప‌ని చేసే పని మనిషి కోసం ఏకంగా థార్ కారు..

ఎస్డీపీఓ గౌతమ్ కుమార్‌పై ఈఓయూ దాడుల్లో భారీ అక్రమ ఆస్తులు వెలుగు చూశాయి. పనిమనిషి పేరుతో కోటి రూపాయల బంగళా, విలాస జీవితం బయటపడటంతో కేసు మరింత సంచలనంగా మారింది

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 10:15 ఉద.
Srinivas Kolluri
3 గంటలు ago
Share
Gautam Kumar Corruption Case

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gautam Kumar Corruption Case | బీహార్‌ (Bihar)లో అవినీతి ఆరోపణల నేపథ్యంలో జరిగిన ఈఓయూ (ఎకనామిక్ ఆఫెన్సెస్ యూనిట్) దాడులు సంచలనంగా మారాయి. కిషన్‌గంజ్ ఎస్డీపీఓగా పనిచేస్తున్న గౌతమ్ కుమార్ నివాసాలపై నిర్వహించిన సోదాల్లో భారీ స్థాయిలో అక్రమ ఆస్తులు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.

Contents
  • Gautam Kumar Corruption Case | పనిమనిషి పేరుతో కోటి రూపాయల బంగళా
    • Gautam Kumar Corruption Case | నోయిడా మరియు గుర్గావ్ లో ఫ్లాట్లు

సుమారు 32 ఏళ్ల సేవలో తన చట్టబద్ధ ఆదాయానికి మించి దాదాపు 60 శాతం అంటే సుమారు 80 కోట్ల రూపాయల బినామీ ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో మరింత సంచలనం రేపిన అంశం ఆయన ఇంట్లో పనిచేసే పనిమనిషి పారో గురించి బయటపడిన వివరాలే. సాధారణంగా పనిమనిషిగా పనిచేసే ఆమె జీవనశైలి మాత్రం విలాసవంతంగా ఉండటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.

Gautam Kumar Corruption Case | పనిమనిషి పేరుతో కోటి రూపాయల బంగళా

దర్యాప్తులో భాగంగా, పారో అనే మహిళకు ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా (Dinajpur District)లో సుమారు ఒక కోటి రూపాయల విలువైన బంగళా ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా, ఆమె రోజువారీ జీవన విధానం కూడా అత్యంత విలాసవంతంగా ఉండేదని అధికారులు గుర్తించారు. పారో ప్రతిరోజూ ఖరీదైన ‘థార్’ కారులో పనికి వచ్చేదని, కొన్నిసార్లు గౌతమ్ కుమార్ ప్రభుత్వ వాహనాన్ని కూడా వినియోగించిందని సమాచారం. అదేవిధంగా ఆమెకు ‘బుల్లెట్’ బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాలు బయటకు రావడంతో కేసు మరింత హాట్ టాపిక్‌గా మారింది. పారో సోషల్ మీడియా (Social Media)లో కూడా చురుకుగా ఉండేది. ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో బుల్లెట్ బైక్‌పై రీల్స్ చేయడం, భారీ మొత్తంలో నగదును ప్రదర్శిస్తూ వీడియోలు పోస్ట్ చేయడం వంటి విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎస్డీపీఓ గౌతమ్ కుమార్ మరియు ఆయన సన్నిహితులతో కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Gautam Kumar Corruption Case | నోయిడా మరియు గుర్గావ్ లో ఫ్లాట్లు

అయితే ఈఓయూ దాడుల విషయం తెలిసిన వెంటనే పారో తన సోషల్ మీడియా ఖాతాలను లాక్ చేసి, కుటుంబంతో కలిసి పరారైనట్లు సమాచారం. మార్చి 31న జరిగిన ఈ సోదాల్లో అధికారులు 36 భూములకు సంబంధించిన పత్రాలు, బంగారు-వెండి ఆభరణాలు, ఖరీదైన గడియారాలు, లగ్జరీ కార్ల (Luxury Cars)కు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పూర్ణియా లో నాలుగు అంతస్తుల భవనం, సిలిగురి లో తేయాకు తోటలు, నోయిడా మరియు గుర్గావ్ లో ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో గౌతమ్ కుమార్‌ను పదవి నుండి తప్పించి, హెడ్‌క్వార్టర్స్‌కు రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Kodagu trekking missing techie | ట్రెక్కింగ్ కి వెళ్లి అదృశ్యమైన టెకీ ఆచూకీ లభ్యం

Shivalik Gas Tanker | తీరనున్న గ్యాస్​ కష్టాలు.. నేడు గుజరాత్ తీరానికి శివాలిక్​ నౌక
I-PAC ED Raids | ‘ఐప్యాక్’ కార్యాలయాల్లో ఈడీ సోదాలు..
IPF UAE 24×7 Help | యూఏఈలో ఇండియన్ పీపుల్స్ ఫోరం హెల్ప్ లైన్​ సర్వీస్.. సమస్యలకు పరిష్కారానికి సహాయ వేదిక​!
West Bengal Elections | పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక అప్​డేట్​.. 291 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన మమతా బెనర్జీ!
Karnataka Politics | కర్ణాటకలో మరోసారి పొలిటికల్‌ ట్విస్ట్​.. సీఎం మార్పు తప్పదా!
TAGGED:BiharDinajpur DistrictGautam Kumar corruption caseInstagramLuxury CarsSocial Media
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Enugu Narasimha Reddy Enugu Narasimha Reddy | కళానిధి.. ఏనుగు నరసింహారెడ్డి
Next Article Heatwave Telangana Heatwave Telangana | నేటి నుంచి పెరగనున్న ఎండలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?