అక్షరటుడే, హైదరాబాద్: GeeVees 2026 | గోద్రెజ్ GeeVees 2026 అవార్డుల విజేతల జాబితాలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులు నిలిచారు. పబ్లిక్ & ఇన్‌స్టిట్యూషనల్ బిల్డింగ్ విభాగంలో ‘కంపార్ట్‌మెంట్ S4’ అవార్డును అందుకోగా, ఎడ్యుకేషనల్ కేటగిరీలో మిలానా మలద్కర్ అరవింద్ జగన్నాథన్ బృందం విజేతలుగా నిలిచారు.
GeeVees 2026 | పట్టణాల్లో కమర్షియల్ ప్రాజెక్టులకు..
లక్షలోపు జనాభా ఉన్న పట్టణాల్లో కమర్షియల్ ప్రాజెక్టులకు గాను మనోజ్ పటేల్, రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు గాను ప్రాచీ పరేఖ్ వోరా & వినీత్ జె. వోరా అవార్డులు కైవసం చేసుకున్నారు.
హాస్పిటాలిటీ రంగంలో మనీష్ బ్యాంకర్ (50 గదుల పైన) దీపికా సేథి (50 గదుల లోపు) విజేతలుగా నిలిచారు. రెసిడెన్షియల్ విల్లా విభాగంలో శ్రవణ్ ప్రదీప్ & మేఘా నానయ్య మెరిశారు. పెద్ద తరహా ఇంటీరియర్ డిజైన్లలో బిజోయ్ రామచంద్రన్ & సునీత కొండూర్, చిన్న తరహా కమర్షియల్ ప్రాజెక్టులలో ప్రాన్వీ జైన్ & ధృవ్ డివి అవార్డులు గెలుచుకున్నారు.
‘సేఫెస్ట్ ప్రాజెక్ట్స్’
వీటితో పాటు శ్రేయ సంఘ్వీ & విపుల్ సంఘ్వీ ‘సేఫెస్ట్ ప్రాజెక్ట్స్’ కేటగిరీలో, రోనక్ ముఖేష్ పటేల్ ‘మల్టీ-యూనిట్ హౌసింగ్’లో, ఓంకార్ వైంగాంకర్ ‘హెల్త్‌కేర్’ విభాగంలో అవార్డులు అందుకున్నారు. ఈ విజేతలందరినీ గోద్రెజ్ తన జాతీయ స్థాయి నెట్‌వర్క్ వేదికల ద్వారా మరింతగా ప్రమోట్ చేయనుంది.
ఇది కూడా చదవండి..: Mahindra BE6 Batman Edition | ధర పెరిగినా ‘బ్యాట్‌మాన్’కు తగ్గని డిమాండ్.. ఏడు నిమిషాల్లోనే సోల్డ్ ఔట్!

