అక్షరటుడే, కామారెడ్డి: Geo Special Technology | తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో జియో స్పెషల్ టెక్నాలజీస్ కీలకపాత్ర పోషిస్తుందని అనంత్ టెక్నాలజీస్ సంస్థ (Ananth Technologies) ఫౌండర్ ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావు అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) సౌత్ క్యాంపస్ జియో ఇన్ఫర్మెటిక్స్ విభాగానికి చెందిన అధ్యాపకులు శనివారం హైదరాబాద్లోని (Hyderabad) హైటెక్ సిటీలో (Hi-Tech City) ఉన్న అనంత్ టెక్నాలజీస్ సంస్థను సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు జియో స్పెషల్ టెక్నాలజీలో జరుగుతున్న నూతన ఆవిష్కరణలను వివరించారు.
Geo Special Technology | ఐఏఎస్ఆర్వో లాంచ్ వెహికిల్స్..
ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ.. ఐఏఎస్ఆర్వోకు సంబంధించి లాంచ్ వెహికిల్స్ అభివృద్ధిలో అనంత్ టెక్నాలజీస్ అందిస్తున్న సేవలను వివరించారు. దేశ అభివృద్ధిలో జియో స్పెషల్ టెక్నాలజీ ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి పైపుల ద్వారా గ్యాస్ కనెక్షన్లు అందించే ప్రక్రియలో కూడా జియో స్పెషల్ టెక్నాలజీ కీలకంగా పనిచేస్తోందన్నారు. అలాగే వ్యవసాయ రంగంలో పంటల విస్తీర్ణం అంచనా, దిగుబడి విశ్లేషణ, అడవుల సంరక్షణ, పట్టణాల అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో జీఐఎస్ విస్తృతంగా వినియోగిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఎస్సీఈ మాజీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రాఘవస్వామి, సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ సుధాకర్ గౌడ్, అధ్యాపకులు డాక్టర్ టి ప్రతిజ్ఞ, డాక్టర్ ఎస్ నారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Toll Plaza Accident | బీఎండబ్ల్యూ కారుపై ట్యాంకర్ లారీ బోల్తా.. పలువురికి గాయాలు
