అక్షరటుడే, న్యూఢిల్లీ: Gift Nifty Gapdown | అమెరికా(America), ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడి చేయడం, ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులకు దిగడంతో మధ్యప్రాచ్యం(Middle East)లో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
కీలకమైన హార్ముజ్ జలసంధి తాత్కాలిక మూసివేతతో సరఫరా అంతరాయాలు ఏర్పడి చమురు ధరలకు రెక్కలొస్తున్నాయి. ఇది ఆందోళన కలిగిస్తోంది. దీంతో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు ప్రతికూలంగా స్పందిస్తున్నాయి. సోమవారం ఉదయం మన మార్కెట్లు సైతం గ్యాప్ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Gift Nifty Gapdown | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్(Wallstreet) నష్టాలతో ముగిసింది. నాస్‌డాక్ 0.94 శాతం, ఎస్ అండ్ పీ 0.43 శాతం నష్టపోయాయి. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.71శాతం నష్టంతో ఉంది.
Gift Nifty Gapdown | యూరోప్ మార్కెట్లు..
ఎఫ్టీఎస్ఈ 0.59 శాతం పెరగ్గా.. సీఏసీ 0.47 శాతం, డీఏఎక్స్(DAX) 0.02 శాతం నష్టపోయాయి.
Gift Nifty Gapdown | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు భారీ నష్టాలతో ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(HangSeng) 2.70 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 1.96 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.54 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.71 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.66 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.46 శాతం నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు భారీ గ్యాప్ డౌన్‌లో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 7,536 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు నికరంగా రూ. 12,292 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.88 నుంచి 0.63కి పడిపోయింది.
- విక్స్ 4.9 శాతం పెరిగి 13.7 వద్ద ఉంది. పీసీఆర్ తగ్గడం, విక్స్ పెరగడం మార్కెట్‌లో భయాలకు సంకేతం.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు బలహీనపడి 90.97 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 76.17 డాలర్లకు చేరింది.
- మార్చి 1న ప్రకటించిన ఆటో సేల్స్ డాటాకు అనుగుణంగా ఆటో స్టాక్‌లు స్పందించనున్నాయి.
- నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.

