అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gold After Death | హిందూ సంస్కృతిలో మంగళప్రదమైన వస్తువులకు విశేషమైన సెంటిమెంట్ ఉంటుంది. భర్త మరణించిన తర్వాత ఆ నగలను ఎవరు తీసుకోవాలి లేదా ఏం చేయాలనే దానిపై చాలామంది సందేహా పడుతుంటారు.
ముఖ్యంగా మృతదేహానికి తాకిన లేదా చనిపోయిన వారు వాడిన నగలను ధరిస్తే అరిష్టం కలుగుతుందని కొందరు నమ్ముతారు. కానీ, జ్యోతిష్య పండితుల అభిప్రాయం ప్రకారం.. బంగారానికి ఎటువంటి దోషం ఉండదు. బంగారం రూపాన్ని మార్చినప్పుడు దానికి ఉన్న పాత దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి వీటి విషయంలో అనవసరపు భయాలు పెట్టుకోవాల్సిన పనిలేదు.
Gold After Death | మంగళసూత్రాల పరిష్కారం:
మంగళసూత్రాల విషయంలో చాలామందికి భావోద్వేగమైన అనుబంధం ఉంటుంది. వాటిని అలాగే ఉంచుకోవాలా లేదా తీసేయాలా అన్న సందేహానికి పండితులు కొన్ని పరిష్కారాలు సూచించారు.
మంగళసూత్రంలోని బంగారు బిళ్లలను కరిగించి ఉంగరాలుగా మార్చుకుని ధరించవచ్చు. ఆ బంగారాన్ని కలిపి కొత్త గొలుసుగా చేయించుకోవచ్చు. ఒకవేళ కుటుంబ సభ్యులు ఆ బంగారాన్ని వాడటానికి ఇష్టపడకపోతే, వాటిని శుద్ధి చేయించి ఆలయాల్లోని అమ్మవారికి సమర్పించడం ఉత్తమమైన మార్గం.
Gold After Death | గాజులు, మెట్టెలు, పట్టీలు:
బంగారు గాజులు: సాధారణంగా మట్టి గాజులను భర్త మరణాంతరం తీసివేస్తారు. అయితే బంగారు గాజులు ధరించడానికి ఎటువంటి ఆటంకం లేదు, వాటిని తీయాల్సిన అవసరం లేదని శాస్త్రం చెబుతోంది.
మెట్టెలు: మన సంప్రదాయం ప్రకారం భర్త చనిపోయిన పదవ రోజున మెట్టెలను తీసి చాకలికి ఇచ్చే ఆచారం చాలా ప్రాంతాల్లో ఉంది.
పట్టీలు: కాళ్లకు ధరించే పట్టీలను చిన్నప్పటి నుంచి ధరిస్తారు కాబట్టి వాటిని తొలగించాల్సిన పని లేదు.
నగల పంపిణీలో నిబంధనలు:
ఆభరణాల పంపకం విషయంలో కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన ఉండటం ముఖ్యం. దీనిపై కొన్ని సంప్రదాయ పద్ధతులు ఉన్నాయి.
పుట్టింటి నగలు: ఒక స్త్రీ తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న నగలను తన కూతుర్లకు బహుమతిగా ఇవ్వడం ఆనవాయితీ.
అత్తగారి నగలు: అత్తగారు ఇచ్చిన నగలు కోడలికి చెందాలి. ఆ తర్వాత ఆమె తన కోడలికి బదిలీ చేయాలి.
ముందస్తు నిర్ణయం: వయసు మళ్ళిన తర్వాత ఏ నగ ఎవరికి చెందాలి అనేది పెద్దలు ముందే స్పష్టం చేయడం వల్ల కుటుంబంలో కలహాలు రాకుండా ఉంటాయి.
ఇది కూడా చదవండి: Sudarshana Chakra Story | సూర్య తేజస్సుతో పుట్టిన ఆయుధం.. సుదర్శన చక్రం వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా?

