Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gold on Wheels Vizag | విశాఖలో ‘గోల్డ్ ఆన్ వీల్స్’ సంచలనం.. తోపుడు బండిపై బంగారం అమ్మకాలు, జనంలో ఆసక్తి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Gold on Wheels Vizag | విశాఖలో ‘గోల్డ్ ఆన్ వీల్స్’ సంచలనం.. తోపుడు బండిపై బంగారం అమ్మకాలు, జనంలో ఆసక్తి

ఆంధ్రప్రదేశ్​

Gold on Wheels Vizag | విశాఖలో ‘గోల్డ్ ఆన్ వీల్స్’ సంచలనం.. తోపుడు బండిపై బంగారం అమ్మకాలు, జనంలో ఆసక్తి

విశాఖ బీచ్ రోడ్డుపై ‘గోల్డ్ ఆన్ వీల్స్’ పేరుతో తోపుడు బండిపై బంగారం అమ్మకం ప్రారంభమవడంతో ప్రజల్లో ఆసక్తి పెరిగింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 13, 2026 9:54 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
9 గంటలు ago
Share
Gold on Wheels Vizag

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gold on Wheels Vizag | ఆభరణాలు అంటే జ్యువెలరీ షోరూమ్‌లు గుర్తొచ్చే రోజుల్లో, ఒక వినూత్న ఆలోచనతో రోడ్డు మీదే బంగారం అమ్మకం ప్రారంభమవడం విశాఖలో చర్చనీయాంశంగా మారింది.

Contents
  • Gold on Wheels Vizag | రూ.800కే బంగారు నాణెం
    • Gold on Wheels Vizag | మళ్లీ ఇదే విధంగా బండి ఏర్పాటు

విశాఖపట్నం (Visakhapatnam) లోని బీచ్ రోడ్డుపై కనిపించిన ఈ ‘గోల్డ్ ఆన్ వీల్స్’ కాన్సెప్ట్ స్థానికులతో పాటు పర్యాటకులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సబ్‌మెరైన్ మ్యూజియం (Submarine Museum) ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక బండి, అచ్చం ఐస్‌క్రీమ్ కార్ట్‌లా కనిపించేలా డిజైన్ చేశారు. ఈ బండిపైకి వచ్చే వారికి ఐస్‌క్రీమ్ ఇచ్చినట్లే బంగారు నాణేలు, చిన్న ఆభరణాలను అందించడం ఈ కాన్సెప్ట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Gold on Wheels Vizag | రూ.800కే బంగారు నాణెం

ఈ వినూత్న ప్రయత్నం వెనుక ఒక జ్యువెలరీ సంస్థ ఉందని నిర్వాహకులు తెలిపారు. పాతకాలంలో రోడ్లపైనే బంగారం అమ్మేవారనే భావనను ఆధునిక మార్కెటింగ్‌తో మిళితం చేసి ‘గోల్డ్ ఆన్ వీల్స్’ (Gold on Wheels)గా తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఈ బండిని చూసిన ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఇక్కడ కేవలం రూ.800కే బంగారు నాణెం అందుబాటులో ఉండటం విశేషం. అంతేకాకుండా, ఎలాంటి మేకింగ్ ఛార్జీలు లేకపోవడంతో వినియోగదారులు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా తక్కువ విలువ గల బంగారు వస్తువులను మాత్రమే బండిపై ఉంచినట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. ఖరీదైన ఆభరణాలు మాత్రం షోరూమ్‌లలోనే అందుబాటులో ఉంటాయని తెలిపారు.

Gold on Wheels Vizag | మళ్లీ ఇదే విధంగా బండి ఏర్పాటు

ఈ నెల 11, 12 తేదీల్లో ప్రారంభమైన ఈ ప్రయోగానికి మంచి స్పందన రావడంతో, మళ్లీ 18, 19, 20 తేదీల్లో కూడా ఇదే విధంగా బండి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజూ సాయంత్రం 5:30 గంటల నుంచి ఈ విక్రయాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, రోడ్డు పక్కన బంగారం అమ్ముతున్న ఈ అరుదైన దృశ్యానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతూ మరింత మంది దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కొత్త తరహా మార్కెటింగ్ పద్ధతులు వినియోగదారులను ఎలా ఆకట్టుకుంటాయో ఈ ‘గోల్డ్ ఆన్ వీల్స్’ మరోసారి రుజువు చేసింది.

 

View this post on Instagram

 

A post shared by VIZAG FOREVER (@vizagforever)

ఇది కూడా చదవండి..: Tirumala July Tickets | 18 నుంచి జూలై నెల శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే..

 

Dhurandhar 2 Review | ధురంధర్ 2పై ప్రశంసల వర్షం కురిపించిన రాజమౌళి.. యాక్టింగ్ మాస్టర్‌క్లాస్ అని వ్యాఖ్య..
QNet Fraud Raids | ఎంఎల్​ఎం సంస్థ క్యూనెట్​పై సీసీఎస్​ దాడులు
Karnataka Social Media Ban | 16 ఏళ్లలోపు వారికి సోషల్​ మీడియా బ్యాన్​.. కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం
Toll Plaza Accident | బీఎండబ్ల్యూ కారుపై ట్యాంకర్​ లారీ బోల్తా.. పలువురికి గాయాలు
Markapuram Bus Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. బస్సులో చెలరేగిన మంటలు.. 10 మంది సజీవ దహనం..
TAGGED:Beach RoadGold on Wheels VizagGold on Wheels’Social MediaSubmarine MuseumVisakhapatnam
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article April 13 Pre Market Analysis April 13 Pre Market Analysis | చర్చలు విఫలం.. నెగెటివ్‌లో స్టాక్ మార్కెట్లు
Next Article Bumrah Wicketless Streak Bumrah Wicketless Streak | యార్కర్ కింగ్ బుమ్రాకు ఏమైంది?.. వరుస మ్యాచ్‌ల్లో ద‌క్క‌ని వికెట్‌, ఫ్యాన్స్‌లో ఆందోళన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?