అక్షరటుడే, కామారెడ్డి: Gold Price Drop | పసిడి ధరలు (Gold Prices) రోజురోజుకు తగ్గుముఖం పట్టాయి. గత కొద్దిరోజులుగా అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల కారణంగా పుత్తడి ధరలు దిగి వస్తున్నాయి. దీంతో సామాన్యలకు, కొనుగోలుదార్లకు పెద్ద ఊరట లభిస్తోంది.
Gold Price Drop | పదిరోజుల క్రితం..రూ. 2లక్షలకు చేరువలో..
గడిచిన రెండు మూడు రోజుల్లో ఏకంగా రూ.30 వేలు తగ్గింది. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.1,38,500 లకు చేరింది. పది రోజుల క్రితం రూ.2 లక్షలకు చేరువైంది. బంగారం ధర ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మళ్లీ బంగారం పెరిగే వరకు చూడటం కంటే తగ్గినప్పుడే తీసుకోవడం మంచిదనే ఆలోచనలో ఉన్నారు.
Gold Price Drop | వెండి కూడా..
బంగారం ధరలతో పాటు వెండి ధర కూడా దిగివచ్చింది. తులం వెండి ధర (Silver Price) ప్రస్తుతం రూ.2150 గా ఉంది. అయితే పెళ్లిళ్ల సీజన్లో అమాంతం పెరిగిన బంగారం, సీజన్ ముగిశాక తగ్గుముఖం పట్టడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న ధర పెళ్లిళ్ల సమయంలో ఉండి ఉంటే ఎక్కువ బంగారం కొనుగోలు చేసే వాళ్లమని పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుత ధరలు ఇంకా తగ్గుతాయా.. లేక మళ్లీ ఒకేసారి అమాంతం పెరిగి ప్రజలకు షాకిస్తుందా అనేది వేచి చూడాలి.
ఇది కూడా చదవండి..: Six Guarantees Budget | బడ్జెడ్లో ఆరు గ్యారెంటీలకు నిధులు శూన్యం: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

