Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gold Price Fall | దిగివస్తున్న బంగారం ధర.. ఆల్ టైం హైనుంచి సగం తగ్గిన వెండి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Gold Price Fall | దిగివస్తున్న బంగారం ధర.. ఆల్ టైం హైనుంచి సగం తగ్గిన వెండి

బిజినెస్​తాజా వార్తలు

Gold Price Fall | దిగివస్తున్న బంగారం ధర.. ఆల్ టైం హైనుంచి సగం తగ్గిన వెండి

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో పసిడి ధరలు దిగివస్తున్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల గోల్డ్ ధర ఆల్ టైమ్ హై నుంచి రూ. 38 వేలు తగ్గడం గమనార్హం.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 23, 2026 12:38 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 రోజులు ago
Share
Gold Price Fall

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gold Price Fall | కొన్నాళ్ల క్రితం వరకు రోజుకో రికార్డు స్థాయి గరిష్టాన్ని నమోదు చేస్తూ దూసుకువెళ్లిన బంగారం, వెండి ధరలు (Silver Prices) దిగివస్తున్నాయి. అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ధర పతనం అవుతూనే ఉంది. ఆల్ టైమ్ హై నుంచి 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ. 38 వేలపైన తగ్గింది. వెండి ధర సైతం భారీగా పడిపోయింది.

Contents
  • Gold Price Fall | ఇన్​ఫ్లెషన్ భయాలతో..
    • Gold Price Fall | జనవరిలో ఆల్ టైం హై..
      • Gold Price Fall | వెండిదీ అదేదారి..

Gold Price Fall | ఇన్​ఫ్లెషన్ భయాలతో..

పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు ముదురుతున్న నేపథ్యంలో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర బ్యారెల్‌కు 113 డాలర్లు దాటింది. యుద్ధం ఇలాగే కొనసాగితే క్రూడ్ ఆయిల్ ధర మరో 50 శాతానికిపైగా పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. దీనికితోడు గ్యాస్ కష్టాలూ ఎక్కువవుతున్నాయి. దీని ప్రభావం అన్ని రంగాలపై పడి ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉండడంతో యూఎస్ ఫెడ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ సహా అన్ని ప్రధాన కేంద్ర బ్యాంకులు కీలక రేట్లను యథాతధంగా కొనసాగించాలని నిర్ణయించాయి.

ప్రధానంగా ఫెడ్ వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయిల్లో ఉంటే యూఎస్ డాలర్, ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ ఆకర్షణీయంగా మారి, బంగారం ఆకర్షణ కోల్పోతోంది. ఇన్వెస్టర్లు డాలర్ వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండి వంటి లోహాల ధరలు పతనమవుతున్నాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగినందున ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతుండడమూ ఆయా లోహాల ధరల పతనానికి కారణంగా నిలుస్తోందంటున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా మరింత పెంచితే భవిష్యత్‌లో బంగారం ధర (Gold Price) మరింత పెరిగే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Gold Price Fall

Gold Price Fall | జనవరిలో ఆల్ టైం హై..

బంగారం ధర జనవరి 29న జీవన కాల గరిష్టాలను చేరింది. ఆ రోజున 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 1,78,850గా నమోదయ్యింది. యుద్ధ భయాలతో బంగారం, వెండి వంటి లోహాల ధరలు పెరుగుతాయని భావించినా ఆశ్చర్యకరంగా వాటి భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి. యుద్ధం ఫిబ్రవరి 28న మొదలవగా.. అప్పటి నుంచి ధరలు దిగివస్తూనే ఉన్నాయి. సోమవారం హైదరాబాద్ (Hyderabad) బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ. 1.40 లక్షలుగా ఉంది.

Gold Price Fall | వెండిదీ అదేదారి..

వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండి ధర జనవరి 29న రూ. 4.25 లక్షలకు చేరి జీవన కాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత లాభాల స్వీకరణతో కొంత దిద్దుబాటుకు గురయ్యింది. అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధంతో మరింత పతనమైంది. సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో స్వచ్ఛమైన వెండి ధర రూ. 2.30 లక్షలుగా ఉంది. అంటే ఆల్ టైం హైనుంచి కిలో వెండి ధర రూ. 1.95 లక్షలు తగ్గిందన్న మాట.

ఇది కూడా చదవండి..: Stock Market Crash | షేక్ అవుతున్న స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు

Teenmar Mallanna Remarks | నా జీతం ఎంతంటే.. రాజకీయ భోగాలపై ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
Balka Suman Bail | మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు
Petrol Shortage Rumors | పెట్రోల్​ కష్టాలు.. బారులు తీరిన వాహనదారులు.. అసలు కారణమిదే?
March 07 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు
Tata Motors March Offers | ‘టాటా మోటార్స్ మార్చి ఆఫర్స్.. డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా..
TAGGED:Crude OilGold Pricegold price fallHyderabadSilver Prices
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Danam Nagender Notices Danam Nagender Notices | ఎమ్మెల్యే దానం నాగేందర్​కు హైకోర్టు నోటీసులు
Next Article Hyderabad Pollution Free Hyderabad Pollution Free | కాలుష్య రహితంగా హైదరాబాద్​ : సీఎం రేవంత్​రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?