అక్షరటుడే, కామారెడ్డి: Gold Price Rise | పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు బంగారం ధర (Gold Price) పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్‌పై దాడులకు దిగిన నేపథ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
Gold Price Rise | రోజురోజుకూ పెరుగుతూ..
యుద్ధం మరింత తీవ్రస్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తుండటంతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) కుప్పకూలుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మదుపర్లు బంగారం, వెండిలో పెట్టుబడులు పెంచుతున్నారు. దీంతో దేశీయ మార్కెట్లో పసిడి ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న సమయంలో ధరల పెరుగుదల వినియోగదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది.
Gold Price Rise | కామారెడ్డిలో..
కామారెడ్డి (Kamareddy)లో సోమవారం తులం బంగారం ధర రూ.1,70,700 లక్షలకు చేరింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో సామాన్య ప్రజలు పసిడి ధరల పెరుగుదలపై ఆందోళన చెందుతున్నారు. కొద్దిరోజుల క్రితం తులం బంగారం దాదాపు రూ.2 లక్షలకు చేరువైంది. తర్వాత ధర ఒక్కసారిగా తగ్గుముఖం పట్టి రూ.1.50లక్షలకు పైగా నిలకడగా ఉంటూ వస్తోంది. సోమవారం ఒక్కసారిగా రూ.1,70,700 కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కామారెడ్డికి పసిడి కొనుగోలు కోసం వచ్చిన ప్రజలు ధరలు చూసి ఖంగుతిన్నారు.
ఇది కూడా చదవండి..: Gold Silver Rates | ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం .. పెళ్లిళ్ల సీజన్లో పరుగులు పెడుతున్న పసిడి

