Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gold Price Surge | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధర
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Gold Price Surge | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధర

బిజినెస్​తాజా వార్తలు

Gold Price Surge | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధర

ఇప్పటికే ఆకాశాన్నంటిన బంగారం ధర.. మధ్యప్రాచ్యంలో యుద్ధంతో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పసిడి ప్రియుల్లో ఆందోళన నెలకొంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఫిబ్రవరి 28, 2026 4:53 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 వారాలు ago
Share
Gold Price Surge
Gold Price Surge

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gold Price Surge | కొంతకాలంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న జియో పొలిటికల్ టెన్షన్స్, అమెరికా అధ్యక్షుడు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలతో ఈక్విటీ మార్కెట్లు కుదేలవుతున్నాయి. పెట్టుబడిదారులు భారీగా నష్టపోతున్నారు.

Contents
  • Gold Price Surge | మళ్లీ రెక్కలు!
    •  Gold Price Surge | జియో పొలిటికల్ టెన్షన్స్

ఈ నేపథ్యంలో చాలామంది సురక్షిత పెట్టుబడులుగా భావించే బంగారం, వెండి వంటి లోహాలలో పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో వీటి ధరలకు ఇప్పటికే రెక్కలొచ్చాయి. ఏడాదిన్నర కాలంలో బంగారం ధర (Gold Price) మూడింతలవగా.. వెండి నాలుగింతలు పెరిగింది. ఇటీవలి కాలంలో ధరలు కాస్త శాంతించి, కాస్త ఊరటనిచ్చాయి.

Gold Price Surge | మళ్లీ రెక్కలు!

మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇజ్రాయిల్, అమెరికా (America) సంయుక్తంగా శనివారం ఇరాన్‌పై దాడులు చేపట్టాయి. ఇరాన్ సైతం దీటుగా స్పందిస్తుండడంతో పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయనే ఆందోళనతో పెట్టుబడిదారులు రక్షణాత్మక ఆస్తుల వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియాలో బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు గణనీయంగా పెరిగాయి.

 Gold Price Surge | జియో పొలిటికల్ టెన్షన్స్

ఏప్రిల్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర రూ.1,60,399 వద్ద ట్రేడ్ అవగా.. మార్చి డెలివరీ సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు సుమారు రూ.2,67,600కు చేరింది. స్పాట్ బులియన్ మార్కెట్‌లో ధరలు షాకిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ (Telangana)లలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 1,64,500 దాటింది. వెండి ధర కిలోకు 10 వేలపైనే పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కేజీ స్వచ్ఛమైన వెండి ధర తిరిగి రూ.3 లక్షలు దాటడం గమనార్హం. జియో పొలిటికల్ టెన్షన్స్ పెరుగుతున్న ప్రతిసారి బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. ఇజ్రాయిల్, ఇరాన్‌ల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చితే ధరలు మరింత భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాన్ని అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Gold Silver Prices | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. రానున్న రోజుల‌లో పెరిగే ఛాన్స్..!

Indian Stock Market Gains | ఒడిదుడుకులు ఎదురైనా.. రెండో రోజూ లాభాలతో ముగిసిన సూచీలు
Iran US Embassy Attack | అమెరికా ఎంబసీపై ఇరాన్​ దాడి
Nizamabad Congress Leader Murder | నిజామాబాద్​ జిల్లాలో కాంగ్రెస్​ నేత దారుణ హత్య!
Tehran Oil Depot Fire | టెహ్రాన్​లోని Shehran Oil Depotలో భారీ పేలుళ్లు.. ఆకాశాన్ని తాకిన అగ్ని జ్వాలలు
Gold Silver Prices | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. రానున్న రోజుల‌లో పెరిగే ఛాన్స్..!
TAGGED:bullion market Indiagold rate todayIsrael Iran tensionsMCX gold futuresMiddle East conflict impactprecious metals newssafe haven investmentsilver price update
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kamareddy SI Retirement Kamareddy SI Retirement | ఇద్దరు ఎస్సైల పదవీ విరమణ
Next Article Banswada MLA Arrest Banswada MLA Arrest | బాన్సువాడకు వెళ్తున్న ఎమ్మెల్యేల అరెస్ట్​..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?