అక్షరటుడే, హైదరాబాద్: Gold Prices Fall | మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్తతలతో పాటు అమెరికా జోక్యం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు, ముడి సరుకు ధరలు పెరుగుతాయని అందరు భావించారు. అదే ప్రభావం బంగారం ధరలపై Gold Rates కూడా ఉంటుందని అనుకున్నారు.
అయితే ఆ అంచనాలు తారుమారు అయ్యాయి. దేశీయ బంగారం మార్కెట్లో వరుసగా రెండో రోజు గోల్డ్ రేట్లు తగ్గడం గమనార్హం. బంగారం ధరలు ఇటీవల రికార్డు స్థాయిలను తాకిన నేపథ్యంలో ఈ తగ్గుదల వినియోగదారులకు కొంత ఊరటనిచ్చింది. ముఖ్యంగా వివాహాలు, శుభకార్యాల సీజన్‌లో కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అనుకూల సమయం కావచ్చని వ్యాపారులు చెబుతున్నారు.
Gold Prices Fall | దేశవ్యాప్తంగా ఈరోజు బంగారం ధరలు
దేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.1,67,610గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.1,53,640కు చేరింది. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
- చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,68,700 కాగా – 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,54,640గా ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,67,610 ఉండగా – 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,640గా నమోదైంది.
- న్యూ ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,67,760 ఉండగా – 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,790గా ఉంది.
- కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,67,610 కాగా – 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,640గా నమోదైంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,67,610 ఉండగా – 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,640గా కొనసాగుతోంది.
- హైదరాబాద్Hyderabadలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,67,610 కాగా – 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,640గా ఉంది.
- విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,67,610 ఉండగా – 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,640గా నమోదైంది.
- విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,67,610 కాగా – 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,640గా ఉంది.
Gold Prices Fall |
వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. దేశీయ మార్కెట్లో ఈరోజు వెండి ధర గ్రాముకు రూ.314.90గా ఉండగా, కిలో ధర రూ.3,14,900గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ Dollar బలం, రూపాయి మారకం విలువ, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల గోల్డ్ కొనుగోళ్లు, దేశీయ డిమాండ్ ధరలపై ప్రభావం చూపుతున్న అంశాలుగా నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు గత కొన్ని వారాలుగా భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం కనిపిస్తున్న ఈ తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తోంది. అయితే మార్కెట్ నిపుణుల ప్రకారం, ప్రపంచ పరిస్థితులు స్థిరపడే వరకు ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగవచ్చని సూచిస్తున్నారు.

