అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gold Prices on Ugadi | ఇటీవల రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం, వెండి ధరలు ఉగాది రోజు స్వల్పంగా తగ్గాయి. మార్చి 19, 2026 గురువారం ఉదయం నమోదైన ధరల ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు(Gold Prices on Ugadi) చూస్తే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.1,57,740గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.1,44,590గా ట్రేడ్ అయింది.
Gold Prices on Ugadi | అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో..
ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు Silver Prices రికార్డు స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇరాన్, అమెరికా–ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్‌లో అస్థిరత వంటి కారణాలతో పసిడి ధరలు నిరంతరం పెరుగుతూ వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు దాదాపు లక్షా 60 వేల రూపాయల మార్క్‌ను కూడా తాకింది. అయితే ఇటీవల కొంత తగ్గుదల కనిపిస్తోంది. ఈ క్రమంలో ఉగాది పండుగ రోజు అయిన మార్చి 19, 2026న బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం దేశవ్యాప్తంగా గోల్డ్, సిల్వర్ రేట్లు ఈ విధంగా ఉన్నాయి.
Gold Prices on Ugadi | కాస్త తగ్గుదల..
ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.1,57,740గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.1,44,590గా నమోదైంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,64,900గా కొనసాగుతోంది.ఇక ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు చూస్తే.. హైదరాబాద్‌లో Hyderabad 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,57,740, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,44,590, వెండి (కిలో): రూ.2,74,900గా ట్రేడ్ అయింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,57,740గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,44,590, వెండి (కిలో): రూ.2,74,900గా నమోదైంది.
ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,57,890, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,44,740, వెండి (కిలో): రూ.2,64,900గా ట్రేడ్ అయింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,57,740, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,44,590, వెండి (కిలో): రూ.2,64,900గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,58,940గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,45,690, వెండి (కిలో): రూ.2,74,900గా ఉంది. అయితే బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా పరిస్థితులు, రాష్ట్ర పన్నులు, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు వంటి అంశాల ఆధారంగా నగరానికొక విధంగా ధరల్లో మార్పులు ఉంటాయి. అందువల్ల రోజువారీగా గోల్డ్, సిల్వర్ రేట్లలో వ్యత్యాసాలు కనిపించడం సాధారణమే.
ఇది కూడా చదవండి..: Trump Warns Iran | ఇరాన్‌కు డొనాల్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..

