అక్షరటుడే, వెబ్డెస్క్: Gold Rates India | దేశంలో గత రెండు మూడు రోజులుగా స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నేడు ఉదయం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,58,090గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,910గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డాలర్ మారకం విలువ, దిగుమతి సుంకాలు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు (Gold Prices) దాదాపు సమానంగానే కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,59,810గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,490గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,090 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,44,910కు విక్రయమవుతోంది.
Gold Rates India | ధరలు పెరుగుదల..
దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు ఎక్కువగానే ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,59,810గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,46,500గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,090గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,44,910గా ఉంది. దక్షిణ భారత నగరాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,090గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,44,910గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఈ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,58,090 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,44,910గా ఉంది.
Gold Rates India | వెండి ధరలు..
ఇక వెండి ధరల (Silver Prices) విషయానికి వస్తే దేశవ్యాప్తంగా నగరాల వారీగా కొద్దిపాటి వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది నగరాల్లో వెండి ధరలు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెండి సగటు ధరలు చూస్తే 1 గ్రాము వెండి రూ.280.10గా ఉండగా, కిలో వెండి ధర రూ.2,80,100గా నమోదైంది. అయితే బంగారం, వెండి ధరలు ప్రతి క్షణం మారే అవకాశం ఉండటంతో కొనుగోలు చేసే ముందు తాజా ధరలను తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Samsung Galaxy M17e | శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయంటే?

