అక్షరటుడే, హైదరాబాద్: march 20 Gold Rates | ఉగాది Ugadi పండుగ సమయంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త అందింది. మార్చి 20వ తేదీ శుక్రవారం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి.
Gold Rates March 20 | భారీ తగ్గుదల..
గత వారం రోజులుగా క్రమంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు, మధ్యలో ఒకరోజు స్వల్పంగా పెరగడంతో మళ్లీ పెరుగుతాయనే అంచనాలు వ్యక్తమయ్యాయి. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒక్కరోజులోనే ధరలు అమాంతంగా కుప్పకూలాయి.
ప్రస్తుతం భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,50,270గా నమోదవగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,37,740కు చేరింది. ప్రధాన నగరాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది.
Gold Rates March 20 | నగరాల వారీగా..
- తమిళనాడు రాజధాని చెన్నైలో Chennai 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,51,630గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,38,990గా ఉంది.
- దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,270, 22 క్యారెట్ల ధర రూ.1,37,740గా నమోదైంది.
- దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,420 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,37,890గా ఉంది.
- కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో కూడా 24 క్యారెట్ల ధర రూ.1,50,270, 22 క్యారెట్ల ధర రూ.1,37,740గా కొనసాగుతోంది.
- తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,270 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,37,740గా ఉంది. అలాగే విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
Gold Rates March 20 | వెండి…
ఇక వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం భారత బులియన్ మార్కెట్లో వెండి ధర Silver Price గ్రాముకు రూ.264.90గా ఉండగా, కిలోకు రూ.2,64,900కు పడిపోయింది.
march 20 Gold Rates | మార్కెట్‌ను బట్టి..
దక్షిణాది నగరాల్లో వెండి ధరలు ఉత్తరాది నగరాల కంటే స్వల్పంగా ఎక్కువగా ఉండటం గమనార్హం. మొత్తానికి, పండుగ సీజన్ సమయంలో బంగారం ధరలు తగ్గడం కొనుగోలుదారులకు మంచి అవకాశం కల్పించింది. అయితే మార్కెట్ పరిస్థితులను బట్టి ధరలు ప్రతి క్షణం మారే అవకాశం ఉండడంతో కొనుగోలు ముందు తాజా ధరలను పరిశీలించడం అవసరం.

