అక్షరటుడే, హైదరాబాద్: Gold Rates Today | మధ్యప్రాచ్యంలో ఇరాన్ – ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గుచూపడంతో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు Gold Rates ఒక్కసారిగా పెరిగాయి. అయితే నిన్నటి నుంచి మార్కెట్‌లో కొంత స్థిరత్వం కనిపిస్తూ ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,64,510 వద్ద ట్రేడ్ కాగా, నేడు అది రూ.1,64,500 వద్ద ఉంది. అంటే పది గ్రాములపై రూ.10 తగ్గుదల నమోదైంది.
Gold Rates Today | ధరలు తగ్గుదల..
24 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,64,500గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,50,790, 18 క్యారెట్లు (10 గ్రాములు): రూ.1,23,370గా నమోదైంది. గ్రాముకు రూ.1 చొప్పున తగ్గడంతో పది గ్రాములపై రూ.10 వరకు తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో స్వల్ప స్థిరత్వం రావడంతో ఈ తగ్గుదల నమోదైనట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధరల సరసన వెండి ధరలు కూడా చేరి క్రమంగా తగ్గుతున్నాయి.
నిన్న హైదరాబాద్‌లో కేజీ వెండి ధర Silver Price రూ.2,95,000 వద్ద ఉండగా, నేడు అది రూ.2,94,900కు చేరింది.కేజీ వెండి: రూ.2,94,900గా ఉండగా, 100 గ్రాములు: రూ.29,490గా ట్రేడ్ అయింది. అంటే కేజీపై రూ.100, 100 గ్రాములపై రూ.10 తగ్గుదల నమోదైంది.
Gold Rates Today : ప్రధాన నగరాల్లో
దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం (పది గ్రాము) ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే..
- హైదరాబాద్‌లో 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,64,500 కాగా, నిన్న ఈ ధర రూ.1,64,510 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,50,790 వద్ద ఉండగా.. బుధవారం రూ.1,50,800గా ఉంది.
- విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం రూ.1,64,500గా ట్రేడ్ కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,50,790 వద్ద ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ రేటు రూ.1,64,500 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,50,790 గా ట్రేడవుతోంది.
- చెన్నైలో Chennaio 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,65,810 గా ట్రేడ్ కాగా.. 22 క్యారెట్ల ధర రూ.1,51,990 వద్ద ట్రేడవుతోంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,64,650గా కొనసాగుతోండగా.. బుధవారం దీని ధర రూ.1,64,660 గా ఉంది.. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,50,940 వద్ద ఉండగా.. నిన్న దీని రేటు రూ.1,50,950 వద్ద ట్రేడవుతోంది.
యుద్ధ పరిస్థితులు మళ్లీ ఉద్ధృతమైతే ధరలు మరోసారి పెరిగే అవకాశముందని బులియన్ వ్యాపారులు హెచ్చరిస్తున్నారు.

