Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gold Silver Prices | అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Gold Silver Prices | అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు

బిజినెస్​తాజా వార్తలు

Gold Silver Prices | అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు

అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్యంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు భారత బులియన్ మార్కెట్‌పై స్పష్టమైన ప్రభావం చూపిస్తున్నాయి. యుద్ధం ముగిసే వరకు బంగారం, వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Naresh chandan
Last updated: మార్చి 1, 2026 8:30 ఉద.
Naresh chandan
4 వారాలు ago
Share
Gold Silver Prices | అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు
Gold Silver Prices | అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు

అక్షరటుడే, హైదరాబాద్​: Gold Silver Prices | అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ముదరడం, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ Ali Khamenei మృతి చెందినట్టు వచ్చిన వార్తలు, అలాగే ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుండటంతో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులకు లోనయ్యాయి.

Contents
  • Gold Silver Prices | ధ‌ర‌లు పైపైకి..
    • Gold Silver Prices | వెండి ధరలు

ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై భారీగా మొగ్గు చూపుతున్నారు. అమెరికా అధ్యక్షుడు Donald Trump ఇరాన్‌పై యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని ప్రకటించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది.

Gold Silver Prices | ధ‌ర‌లు పైపైకి..

ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్, సిల్వర్ ధరలు Silver Prices ఎగసిపడుతున్నాయి. యుద్ధ పరిస్థితులు చల్లారే వరకు ఈ పెరుగుదల కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) ఎలా ఉన్నాయ‌నేది చూస్తే..

  • హైదరాబాద్‌లో 24 క్యారెట్లు: ₹1,68,710 – 22 క్యారెట్లు: ₹1,54,650గా ఉంది.
  • విజయవాడ & విశాఖపట్నంల‌లో 24 క్యారెట్లు: ₹1,68,710 – 22 క్యారెట్లు: ₹1,54,650గా ఉంది.
  • చెన్నైలో 24 క్యారెట్లు: ₹1,69,640 – 22 క్యారెట్లు: ₹1,55,500గా ఉంది.
  • బెంగళూరులో 24 క్యారెట్లు: ₹1,68,710 – 22 క్యారెట్లు: ₹1,54,650గా ట్రేడ్ అయింది.
  • ఢిల్లీలో 24 క్యారెట్లు: ₹1,68,860 – 22 క్యారెట్లు: ₹1,54,800గా ఉంది.
  • దేశ రాజధాని ఢిల్లీలో Delhi ధరలు కొద్దిగా ఎక్కువగా ఉండగా, దక్షిణ భారత నగరాల్లో కూడా బంగారం రేట్లు గరిష్ట స్థాయికి చేరాయి.

Gold Silver Prices | వెండి ధరలు

వెండి ధర (కిలోకు) ఢిల్లీలో ₹2.95 లక్షలుగా ఉండ‌గా, హైదరాబాద్లో ₹3.20 లక్షలు, విజయవాడ & విశాఖపట్నం – ₹3.20 లక్షలుగా ఉంది. చెన్నై – ₹3.20 లక్షలు, బెంగళూరు – ₹2.95 లక్షలుగా ట్రేడ్ అయింది. వెండి ధరలు కూడా బంగారానికి అనుసంధానంగా భారీగా పెరిగాయి.

ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై మార్కెట్లలో కిలో వెండి ₹3.20 లక్షల వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు, స్టాక్ మార్కెట్లలో అస్థిరత, డాలర్ మారకం విలువ మార్పులు, సురక్షిత పెట్టుబడులపై ఇన్వెస్టర్ల దృష్టి వ‌ల‌న ధ‌ర‌లు భారీగా పెరుగుతున్నాయి.

Ustaad Bhagat Singh Glimpse | ఇక గూస్​ బంప్సే​.. ఊపేస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ట్రైలర్‌ టీజ్‌
March 09 Gold Silver Rates | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా పరిస్థితి ఇదే!
Fake Dentist Arrest | పదో తరగతి పాస్​ కాకుండానే డాక్టర్​గా.. నకిలీ వైద్యుడి అరెస్ట్​
Axis Finance | వినియోగదారుల భద్రతకు పెద్దపీట.. ఏఐ మానిటరింగ్‌ను ప్రారంభించిన యాక్సిస్ ఫైనాన్స్
Sudarshana Chakra Story | సూర్య తేజస్సుతో పుట్టిన ఆయుధం.. సుదర్శన చక్రం వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా?
TAGGED:gold price todaygold rate IndiaIndian bullion marketMiddle East conflictsafe haven investmentSilver price todaysilver rate updateUS Iran tensions
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Ali Khamenei Death | ఖమేనీ మరణం.. ఇరాన్​లో 40 రోజులు సంతాప దినాలు.. వారం రోజులు సెలవులు! Ali Khamenei Death | ఖమేనీ మరణం.. ఇరాన్​లో 40 రోజులు సంతాప దినాలు.. వారం రోజులు సెలవులు!
Next Article Iran Qatar Missile Attack | ఖతార్​పై ఇరాన్​ 66 క్షిపణులు, 114 ష్రాప్నెల్స్​ ప్రయోగం Iran Qatar Missile Attack | ఖతార్​పై ఇరాన్​ 66 క్షిపణులు, 114 ష్రాప్నెల్స్​ ప్రయోగం!
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?