Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gold Silver Rates | ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం .. పెళ్లిళ్ల సీజన్లో పరుగులు పెడుతున్న ప‌సిడి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Gold Silver Rates | ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం .. పెళ్లిళ్ల సీజన్లో పరుగులు పెడుతున్న ప‌సిడి

బిజినెస్​తాజా వార్తలు

Gold Silver Rates | ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం .. పెళ్లిళ్ల సీజన్లో పరుగులు పెడుతున్న ప‌సిడి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు సేఫ్ హావెన్‌గా బంగారం, వెండివైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా పసిడి ధరలు మరోసారి పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్‌లో ఈ పెరుగుదల కొనుగోలుదారులకు షాక్ ఇస్తోంది.

Naresh chandan
Last updated: మార్చి 2, 2026 7:51 ఉద.
Naresh chandan
4 వారాలు ago
Share
Gold Silver Rates | ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం .. పెళ్లిళ్ల సీజన్లో పరుగులు పెడుతున్న ప‌సిడి
Gold Silver Rates | ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం .. పెళ్లిళ్ల సీజన్లో పరుగులు పెడుతున్న ప‌సిడి

అక్షరటుడే, హైదరాబాద్​: Gold Silver Rates | పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ముదురుతోంది. ఇజ్రాయెల్‌, అమెరికా కలిసి ఇరాన్‌ Iranపై దాడులకు దిగిన నేపథ్యంలో పరిస్థితులు ఉత్కంఠభరితంగా మారాయి. ఇరాన్ సుప్రీం లీడర్అలీ ఖ‌మేని Ali Khamenei హత్యకు గురైనట్టు వెలువడిన వార్తలతో ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించిందనే సమాచారం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది.

Contents
  • Gold Silver Rates | కుప్పకూలుతున్న స్టాక్​ మార్కెట్​లు..
    • Gold Silver Rates | పెరుగుతున్న ధ‌ర‌లు..

Gold Silver Rates | కుప్పకూలుతున్న స్టాక్​ మార్కెట్​లు..

యుద్ధం మరింత తీవ్రస్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తుండటంతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సేఫ్ హావెన్ ఆస్తులైన బంగారం, వెండిలో పెట్టుబడులు పెంచుతున్నారు.

ఫలితంగా దేశీయ మార్కెట్లో పసిడి ధరలు రోజురోజుకీ ఎగబాకుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న సమయంలో ధరల పెరుగుదల వినియోగదారులకు భారంగా మారుతోంది. సోమవారం కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు స్వల్పంగా పెరిగాయి.

Gold Silver Rates | పెరుగుతున్న ధ‌ర‌లు..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములు) ఎలా ఉన్నాయ‌నేది చూస్తే…హైదరాబాద్ Hyderabadలో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,73,090 వద్ద కొనసాగుతోంది. నిన్న ఇది రూ.1,73,080 వద్ద ఉండగా స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,58,660 వద్ద ట్రేడవుతోంది (నిన్న రూ.1,58,650).

విజయవాడ & విశాఖపట్నం లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,73,090గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,58,660 వద్ద కొనసాగుతోంది. చెన్నై లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,72,100. నిన్న రూ.1,72,090గా ఉండగా స్వల్ప పెరుగుదల నమోదైంది. 22 క్యారెట్ల ధర ప్రస్తుతం రూ.1,57,760 (నిన్న రూ.1,57,750). బెంగళూరు లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,73,090 వద్ద ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,58,660గా కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీ New Delhiలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,73,240.22 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,810 గాఉంది.

ఇక వెండి ధరలు (కిలోకు) ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,94,900 (నిన్న రూ.2,95,000)గా ఉంది. హైద‌రాబాద్‌లో కేజీ వెండి రూ.3,25,100 (నిన్న రూ.3.25 లక్షలు) కాగా, చెన్నైలో కేజీ వెండి రూ.3,25,100గా ఉండ‌గా, బెంగ‌ళూరులో కేజీ వెండి రూ.2,94,900 (నిన్న రూ.2.95 లక్షలు)గా ఉంది.

మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, యుద్ధ ఉద్రిక్తతలు తగ్గకపోతే బంగారం ధరలు మరికొన్ని రోజులు ఇలానే కొనసాగే అవకాశముంది. పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనుగోలు తప్పనిసరి కాగా, కొనుగోలు చేయాలా.. లేక‌ ధరలు తగ్గే వరకు వేచి చూడాలా? అన్న దానిపై సందిగ్ధత నెలకొంది.

Putta Mahesh | డ్రగ్స్​ ఆరోపణలపై పార్టీ అధిష్ఠానం సీరియస్​.. ఎంపీ పుట్టా వివరణ!
Sleeping Direction Vastu | ఈ దిశలో తల పెట్టి పడుకుంటున్నారా.. అయితే అనారోగ్యం తప్పదు!
Deepa Aradhana Significance | హిందూ సంప్రదాయంలో దీపారాధన ఆనవాయితీ.. ఆ రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Ramlalla Darshan | చైత్ర నవరాత్రి అష్టమి సందర్భంగా శ్రీ రామలల్లా దివ్య దర్శనం
Kavitha Hunger Strike | కవితకు కొడుకు అండ.. చదువుకునే వయసులోనే రాజకీయాలపై ఫోకస్!
TAGGED:gold rates todayHyderabad gold rateIndia bullion marketIran Israel war impactMarch 2 gold pricesafe haven investmentsilver rates todaywedding season gold prices
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Today Horoscope | గుండెలను కొల్లగొట్టే అయస్కాంతతత్వం ఈ రాశుల వారికే సొంతం! Today Horoscope | గుండెలను కొల్లగొట్టే అయస్కాంతతత్వం ఈ రాశుల వారికే సొంతం!
Next Article Bansilalpet Stepwell Events | వారాంతపు సాంస్కృతిక వేదిక.. బన్సీలాల్‌పేట స్టెప్‌వెల్ Bansilalpet Stepwell Events | వారాంతపు సాంస్కృతిక వేదిక.. బన్సీలాల్‌పేట స్టెప్‌వెల్
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?