అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gold Silver Rates | అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ అనిశ్చితుల ప్రభావంతో ఇటీవల తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన బంగారం ధరలు (Gold Rates) ప్రస్తుతం కొంత స్థిరంగా కనిపిస్తున్నాయి.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం.. మార్చి 28 ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,720గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,32,660గా కొనసాగుతోంది. ఇక వెండి విషయానికి వస్తే, కిలో ధర ప్రస్తుతం రూ.2,44,900 వద్ద ఉంది. అయితే నిన్నటి ట్రేడింగ్‌లో వెండి ధరలు ఏకంగా రూ.15,000 వరకు పడిపోవడం మార్కెట్‌లో చర్చనీయాంశమైంది. అదే సమయంలో బంగారం ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రూ.160, 22 క్యారెట్ల బంగారం రూ.150 మేర పెరిగినట్లు సమాచారం.
Gold Silver Rates | స్వల్ప మార్పులు..
మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) 24 క్యారెట్ల బంగారం ధర 4,492 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, వెండి ధర (Silver Prices) ఔన్స్‌కు 69 డాలర్లుగా ఉంది. ఇదే సమయంలో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ఠ స్థాయికి చేరుకుంది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి రూపాయి విలువ రూ.94.85 వద్ద నిలిచింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్ప వ్యత్యాసాలతో కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,520గా ఉండగా, ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో దాదాపు రూ.1,44,700 పరిధిలోనే కొనసాగుతోంది. అలాగే విజయవాడలో కూడా ఇదే ధరలు నమోదయ్యాయి.
Gold Silver Rates | వెండి ధరలు
వెండి ధరలు కూడా నగరాలవారీగా మార్పులు చూపుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, విజయవాడ (Vijaywada) వంటి నగరాల్లో కిలో వెండి రూ.2,44,900గా ఉండగా, ఇతర ప్రధాన నగరాల్లో రూ.2,39,900 వద్ద కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, డాలర్ బలపడటం, రూపాయి బలహీనత వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. రాబోయే రోజుల్లో గ్లోబల్ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ధరల్లో మరింత మార్పులు ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి..: Gold Jewelry Buying | నగలు రెడీమేడ్ తీసుకోవాలా..? చేయించాలా..? నిపుణులు ఏమంటున్నారంటే!

