అక్షరటుడే, వెబ్డెస్క్: Gold Silver Rates Today | అంతర్జాతీయ భౌగోళిక పరిణామాల ప్రభావంతో ఇటీవల తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన బంగారం ధరలు (Gold Rates) గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుతున్నాయి. ఈ ట్రెండ్ ఈ రోజు (ఏప్రిల్ 8) కూడా కొనసాగింది. పసిడి ధరలు స్వల్పంగా పడిపోవడం కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది.
ఈ రోజు ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర (Gold Price) రూ.1,49,830 వద్ద నమోదైంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,340గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ధరలు కొద్దిగా ఎక్కువగా ఉండగా, అక్కడ 24 క్యారెట్ల బంగారం రూ.1,49,980కు, 22 క్యారెట్ల బంగారం రూ.1,37,490కు చేరుకుంది.
Gold Silver Rates Today | తగ్గుతున్న ధరలు..
దక్షిణ భారత నగరాల్లో ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు (Bangalore) వంటి ప్రాంతాల్లో ధరలు దాదాపు ఒకే స్థాయిలో కొనసాగుతున్నాయి. చెన్నైలో మాత్రం ఇతర నగరాలతో పోలిస్తే కొద్దిగా అధిక ధరలు నమోదవుతున్నాయి. ఇక వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర (Silver Price) రూ.2.5 లక్షల సమీపంలో కదలాడుతోంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై వంటి నగరాల్లో వెండి ధర రూ.2,54,900గా ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాల్లో రూ.2,49,900 వద్ద కొనసాగుతోంది. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) గాను హైదరాబాద్: 24కే రూ.1,49,830,22కే రూ.1,37,340 కాగా,
విజయవాడ: 24కే రూ.1,49,830, 22కే రూ.1,37,340గా ట్రేడ్ అయింది.
Gold Silver Rates Today | మళ్లీ మార్పులు ఉండే అవకాశం
ఇక ఢిల్లీ Delhi : 24కే రూ.1,49,980, 22కే రూ.1,37,490, ముంబై: 24కే రూ.1,49,830 , 22కే రూ.1,37,340, చెన్నై: 24కే రూ.1,51,190 , 22కే రూ.1,38,590, బెంగళూరు: 24కే రూ.1,49,830 , 22కే రూ.1,37,340గా ట్రేడ్ అయింది. ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు) హైదరాబాద్: రూ.2,54,900, విజయవాడ: రూ.2,54,900, చెన్నై: రూ.2,54,900, ఢిల్లీ: రూ.2,49,900, ముంబై: రూ.2,49,900, బెంగళూరు: రూ.2,49,900గా ట్రేడ్ అయింది. మొత్తం మీద, బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం మార్కెట్‌లో కొంత స్థిరత్వాన్ని సూచిస్తున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం వల్ల వచ్చే రోజుల్లో మళ్లీ మార్పులు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..: April 08 Pre Market Analysis | ట్రంప్ వెనుకడుగు.. మార్కెట్ల ముందడుగు.. భారీ లాభాలతో ప్రారంభం కానున్న స్టాక్ మార్కెట్
