అక్షరటుడే, వెబ్‌డెస్క్: Good Luck Signs | జీవితంలో అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో ఊహించడం కష్టం. కొందరిని అదృష్టం వెతుక్కుంటూ వస్తే, మరికొందరు ఆ లక్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తుంటారు.
అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం మనకు మంచి రోజులు రాబోయే ముందు ప్రకృతి కొన్ని రహస్య సంకేతాలను ఇస్తుంది. ఇంట కూడా ఈ మార్పులు కనిపిస్తే, త్వరలోనే ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఉన్నత స్థితికి చేరుకోబోతున్నారని అర్థం. ఆ సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Good Luck Signs | పక్షుల సందడి – లక్ష్మీదేవి రాకకు సూచన:
ఇంటి ప్రాంగణంలో పక్షులు కిలకిలరావాలు చేస్తున్నాయా? అయితే అది శుభపరిణామమే! వాస్తు ప్రకారం చిలకలు లేదా గుడ్లగూబలు ఇంటి పరిసరాల్లో కనిపిస్తే అదృష్టం తలుపు తట్టబోతుందని అర్థం. ముఖ్యంగా గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం కాబట్టి, అది ఇంటి చుట్టూ కనిపిస్తే సంపద వృద్ధి చెందుతుందని పండితులు చెబుతుంటారు.
Good Luck Signs | కలలో కమలం – కొత్త వెలుగులకు నాంది:
కలలు మన భవిష్యత్తును ప్రతిబింబిస్తాయి. ఎవరికైనా కలలో తామర పువ్వు కనిపిస్తే, వారి జీవితంలో ఒక అద్భుతమైన మలుపు రాబోతుందని అర్థం. కమలం పవిత్రతకు, సానుకూలతకు చిహ్నం. ఇది కలలో వచ్చిందంటే ఇంట్లో శుభకార్యాలు జరగడం లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభమై సక్సెస్ అవ్వడం వంటివి జరుగుతాయి.
ఆవు దర్శనం – విజయానికి సంకేతం:
హిందూ ధర్మంలో ఆవును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఆవు ఎదురుపడితే, ఆ కార్యం దిగ్విజయంగా పూర్తవుతుందని అర్థం. మరీ ముఖ్యంగా, ఆవు తన దూడకు పాలు ఇస్తున్న దృశ్యం కనిపిస్తే, ఊహించని ధనలాభం కలగడంతో పాటు అన్ని పనుల్లో విజయం లభిస్తుంది.
ఇది కూడా చదవండి: Betel Leaves Dream | కలలో తమలపాకు కనిపిస్తే ఫలితం ఏమిటి.. స్వప్న శాస్త్రం చెబుతున్న నిజం ఇదే!

