అక్షరటుడే, హైదరాబాద్ : Oily Skin | జిడ్డు అనేది చర్మం కింద ఉండే సెబేషియస్ గ్రంథులు (Sebaceous Glands) ఎక్కువగా సీబమ్ (Sebum) అనే నూనెను ఉత్పత్తి చేయడం వల్ల వస్తుంది. సరైన సంరక్షణతో దీనిని నియంత్రించవచ్చు.
జిడ్డు నియంత్రణ కోసం చిట్కాలు (Oil Control Tips):
పాలు:కొద్దిగా పాలను ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడగాలి.పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది తేలికపాటి ఎక్స్‌ఫోలియేటర్‌గా (Exfoliator) పనిచేసి, జిడ్డుదనాన్ని, మృతకణాలను తొలగించి, సీబమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.
తేనె :తేనెను ముఖానికి పూతలా వేసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.తేనె సహజసిద్ధమైన హ్యూమెక్టెంట్ (Humectant) , యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మానికి అవసరమైన తేమను అందిస్తూనే, జిడ్డు వల్ల వచ్చే మొటిమలను తగ్గిస్తుంది.
నిమ్మరసం , ఐస్ : నిమ్మరసం కలిపిన నీటితో ముఖం కడగాలి లేదా నిమ్మ ,ఐస్‌క్యూబ్‌తో రుద్దాలి. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మ రంధ్రాలను బిగుతుగా చేసి, జిడ్డు బయటకు రాకుండా అదుపు చేస్తుంది. ఐస్ క్యూబ్స్ (Ice Cubes) తాత్కాలికంగా రంధ్రాలను మూసివేయడానికి సహాయపడతాయి.
ఇంటి చిట్కాలు:
గుడ్డు తెల్లసొన, ద్రాక్షరసం, నిమ్మరసం : గుడ్డు తెల్లసొన (Egg White) , కొద్దిగా ద్రాక్షరసం, కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి వేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. గుడ్డు తెల్లసొన చర్మాన్ని బిగుతుగా చేస్తుంది (టానింగ్). ద్రాక్షరసంలో యాంటీఆక్సిడెంట్లు ఉండి చర్మాన్ని మృదువుగా చేస్తాయి. నిమ్మరసం ముఖాన్ని శుభ్రపరుస్తుంది (క్లెన్సర్).
ముల్తానీ మట్టి : ముల్తానీ మట్టి (Multani Mitti) లో రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్‌గా వేయాలి. ఇది జిడ్డు చర్మానికి అత్యంత ప్రభావవంతమైన చిట్కా. ముల్తానీ మట్టి జిడ్డును,మలినాలను పూర్తిగా పీల్చుకుంటుంది.
చర్మ సంరక్షణలో ముఖ్యమైన నియమాలు, ముఖాన్ని శుభ్రపరిచే విధానం :
జిడ్డుగా ఉందని పదే పదే సబ్బుతో లేదా ఫేస్‌వాష్‌తో ముఖం కడగడం సరికాదు. ఇలా చేయడం వల్ల చర్మం మరింత పొడిగా మారి, పోయిన జిడ్డును భర్తీ చేసి ,చర్మం మరింత సీబమ్‌ను ఉత్పత్తి చేస్తుంది.రోజుకు 2 లేదా 3 సార్లు మాత్రమే మైల్డ్ (Mild) ఫేస్‌వాష్‌తో లేదా సాధారణ నీటితో ముఖం కడుక్కోవాలి.
టానింగ్ (Toning):
ముఖం కడుక్కున్న తర్వాత ఆల్కహాల్ లేని టోనర్ లేదా చల్లటి రోజ్ వాటర్‌ను వాడటం అలవాటు చేసుకోవాలి. ఇది తెరుచుకున్న చర్మ రంధ్రాలను మూసివేయడానికి ,అదనపు జిడ్డును తొలగించడానికి సహాయపడుతుంది.
మాయిశ్చరైజర్ అవసరం:
ఆయిలీ స్కిన్ ఉన్నవారు మాయిశ్చరైజర్ వాడకూడదని చాలామంది అనుకుంటారు. కానీ, ఇది తప్పు. జిడ్డు చర్మానికి కూడా తేలికపాటి, ఆయిల్-ఫ్రీ , జెల్-బేస్డ్ (Gel-based) మాయిశ్చరైజర్ తప్పనిసరిగా వాడాలి. ఇది చర్మాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.
మేకప్ తొలగింపు:
మేకప్ వేసుకుంటే, రాత్రి పడుకునే ముందు దాన్ని పూర్తిగా తొలగించాలి. లేకపోతే అది చర్మ రంధ్రాలను మూసివేసి, మొటిమలు రావడానికి కారణమవుతుంది.


