అక్షరటుడే, బాన్సువాడ: Government Degree College Facilities | ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నిష్ణాతులైన అధ్యాపకులు బోధిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారని బాన్సువాడలోని ఎస్ఆర్ఎన్‌కే (srnk degree college) ప్రభుత్వ డిగ్రీ కళాశాల (government degree college) ప్రిన్సిపాల్ గంగాధర్ తెలిపారు. శుక్రవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో బాన్సువాడ, బీర్కూర్, వర్ని, గాంధారి, పిట్లం, బిచ్కుంద ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాల వద్ద కళాశాల అధ్యాపకులు ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
Government Degree College Facilities | ఇంటర్ తర్వాత ఉన్నత విద్యనభ్యసించాలి..
ఈ సందర్భంగా వారు ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరి ఉన్నత విద్యను (college awareness campaign) అభ్యసించాలని సూచించారు. ప్రైవేట్ కళాశాలలతో పోలిస్తే ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన బోధనతో (intermediate students guidance) పాటు అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా అనుభవజ్ఞులైన (quality education telangana) అధ్యాపకుల బోధన, గ్రంథాలయం, ప్రయోగశాలలు, డిజిటల్ వసతులు విద్యార్థుల అభ్యాసానికి ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. కళాశాలలో ఇంగ్లిష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియంలలో విద్యార్థులకు చదివే అవకాశం కల్పిస్తున్నామని ప్రిన్సిపాల్ తెలిపారు.
Government Degree College Facilities | అందుబాటులో 950 సీట్లు..
అదేవిధంగా డిగ్రీ మొదటి సంవత్సరానికి సుమారు 950 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో (college awareness campaign) చేరితే తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను పొందగలరని పేర్కొన్నారు. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని బాన్సువాడ ఎస్ఆర్ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు పొందాలని అధ్యాపకులు కోరారు. ప్రచార కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Kamareddy Industrial Corridor | కామారెడ్డిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలి: కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే కేవీఆర్ వినతి

