Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gruha Jyothi Scheme | ఇల్లు కట్టకుండానే గృహజ్యోతి బిల్లు.. విద్యుత్​ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Gruha Jyothi Scheme | ఇల్లు కట్టకుండానే గృహజ్యోతి బిల్లు.. విద్యుత్​ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం..

నిజామాబాద్

Gruha Jyothi Scheme | ఇల్లు కట్టకుండానే గృహజ్యోతి బిల్లు.. విద్యుత్​ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం..

కామారెడ్డిలో ఉన్న ఇంటికే గృహజ్యోతి రాక ఇబ్బందులు పడుతుంటే.. నిర్మాణంలో ఉన్న ఓ ఇంటికి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ సబ్సిడీ రావడం చర్చనీయాంశంగా మారింది.

Shashi kiran mottala
Last updated: మార్చి 5, 2026 9:11 సా.
Shashi kiran Mottala
3 వారాలు ago
Share
Gruha Jyothi Scheme |
Gruha Jyothi Scheme | ఇల్లు కట్టకుండానే గృహజ్యోతి బిల్లు.. విద్యుత్​ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం..

అక్షరటుడే, కామారెడ్డి: Gruha Jyothi Scheme | ఒక ఇంటికి విద్యుత్ మీటర్ కావాలంటే సవాలక్ష నిబంధనలు ఉంటాయి. ఇటీవల ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ (telangana free electricity) అందిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికే చాలామంది లబ్ది పొందుతున్నారు. ప్రస్తుతం ఆ పథకానికి సంబంధించిన సైట్ క్లోజ్ కావడంతో దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా మూలన పడి ఉన్నాయి.

Contents
  • Gruha Jyothi Scheme | సైట్​ ఓపెన్​ ఉన్నప్పుడు..
    • Gruha Jyothi Scheme | బిచ్కుంద మండల కేంద్రంలో..

Gruha Jyothi Scheme | సైట్​ ఓపెన్​ ఉన్నప్పుడు..

సైట్ ఓపెన్ ఉన్నప్పుడు గృహజ్యోతి (gruha jyothi scheme) అమలు చేయాలంటే సవాలక్ష కొర్రీలు అడ్డువచ్చాయి. అర్హులైన అనేక మంది ఇప్పటికి గృహజ్యోతి పథకం కోసం ఎదురు చూస్తున్నారు. ఉన్న ఇంటికే గృహజ్యోతి (kamareddy district news) రాక ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఓ ఇంటికి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ సబ్సిడీ రావడం చర్చనీయాంశంగా మారింది.

Gruha Jyothi Scheme | బిచ్కుంద మండల కేంద్రంలో..

బిచ్కుంద మండల కేంద్రంలో (bichkunda mandal issue) ఓ వ్యక్తి నూతనంగా ఇంటిని నిర్మిస్తున్నాడు. సాధారణంగా అయితే కేటగిరి–2 కింద విద్యుత్ మీటర్​కు దరఖాస్తు చేసుకుని ఆ తర్వాత దానిని కేటగిరి–1కు మార్చుకుని గృహజ్యోతి (electricity department telangana) పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాకాకుండా ఇతను తన పాత ఇంటికి సంబంధించిన విద్యుత్ మీటర్​ను కొత్త ఇంటికి బిగించి ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందుతున్నాడు. దాంతో చుట్టుపక్కల జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గృహజ్యోతి నిబంధనల ప్రకారం 200 యూనిట్స్ దాటితే పెరిగిన బిల్లును ముక్కుపిండి మరీ వసూలు చేసే విద్యుత్ అధికారులకు ఈ తతంగం కనిపించడం లేదా అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి..

substation

ఇది కూడా చదవండి: Head Constable Death | గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

ASHA Workers Demand | ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి : సీఐటీయూ డిమాండ్
Citizen Friendly Policing | సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్​కు ప్రాధాన్యతనివ్వాలి: ఎస్పీ రాజేష్ చంద్ర
Unseasonal Rain Damage | వడగళ్లు.. పిడుగులు.. అకాల వర్షాలతో అతలాకుతలం!
National Lok Adalat | లోక్ అదాలత్​ను సద్వినియోగం చేసుకోవాలి : సీపీ సాయి చైతన్య
Operation Kavach Inspections | అర్ధరాత్రి ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
TAGGED:bichkunda mandal issueelectricity department telanganagruha jyothi schemeKamareddy district newstelangana free electricity
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article India vs England Semi | సెమీస్‌లో భారత జట్టు భారీ స్కోర్… ఇంగ్లండ్‌కు 254 పరుగుల లక్ష్యం India vs England Semi | సెమీస్‌లో భారత జట్టు భారీ స్కోర్… ఇంగ్లండ్‌కు 254 పరుగుల లక్ష్యం
Next Article Ananda Bose Resignation | పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్‌ రాజీనామా Ananda Bose Resignation | పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్‌ రాజీనామా
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?