అక్షరటుడే, వెబ్డెస్క్ : Gulf Iran Tensions | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ (Iran) పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఆయా దేశాల్లో ఉన్న భారతీయులపై ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రధాని మోదీ (PM Modi) ఆయా దేశాల అధినేతలతో మాట్లాడారు
ప్రధానిమోదీ సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో ఫోన్లో మాట్లాడారు. ఆయా దేశాల్లో భారతీయుల యోగక్షేమాలను ఆరా తీశారు. అమెరికా, ఇజ్రాయెల్– ఇరాన్ మధ్య వివాదం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధానమంత్రి మోదీ గల్ఫ్ దేశాల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఆయన ఖండించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతను తగ్గించాలని పిలుపునిచ్చారు.
Gulf Iran Tensions | భద్రత కేబినెట్ కమిటీ సమావేశం
ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడాని ప్రధానమంత్రి భద్రతా కేబినెట్ కమిటీ సమావేశాన్ని సైతం నిర్వహించారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.

Gulf Iran Tensions | ఒక భారతీయుడి మృతి
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటి వరకు ఒక భారతీయుడు మృతి చెందాడు. మస్కట్లో పేలుడు పదార్థాలతో నిండిన మానవరహిత పడవ చమురు ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో అతడు చనిపోయాడు. ఆ ఆయిల్ ట్యాంకర్లో 21 మంది సిబ్బంది ఉండగా.. అందులో 16 మంది భారతీయులు.
దీనిని కూడా చదవండి : US Fighter Jets Crash | కువైట్‌లో కూలిన అమెరికా యుద్ధ విమానాలు

