Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gulf Telugu Advisory | గల్ఫ్​లో ఉన్న తెలుగు వారికి సీఎం కీలక సూచనలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Gulf Telugu Advisory | గల్ఫ్​లో ఉన్న తెలుగు వారికి సీఎం కీలక సూచనలు

తెలంగాణఅంతర్జాతీయం

Gulf Telugu Advisory | గల్ఫ్​లో ఉన్న తెలుగు వారికి సీఎం కీలక సూచనలు

గల్ఫ్​ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. అక్కడ చిక్కుకున్న వారిని తరలించాలని కేంద్రాన్ని కోరారు.

Srinivas kolluri
Last updated: మార్చి 1, 2026 6:48 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
cm revanth

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gulf Telugu Advisory | పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా దేశాల్లో ఉన్న తెలుగు వారంతా అప్రమత్తంగా, క్షేమంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సూచించారు. తెలంగాణ నుంచి లక్షలాది మంది బతుకు దెరువు కోసం గల్ఫ్​ దేశాల్లో ఉంటున్నారు. అయితే ఆయా దేశాలపై ఇరాన్​ దాడులు చేస్తుండటంతో సీఎం కీలక సూచనలు చేశారు.

Contents
  • Gulf Telugu Advisory | భారత్​కు తరలించాలి
    • Gulf Telugu Advisory | ఆయిల్​ ట్యాంకర్​పై ఇరాన్​ దాడి
      • విమానాలు రద్దు

యుద్ధ వాతావరణం, పలు దేశాల విమానాశ్రయాలను మూసి వేసిన నేపథ్యంలో ఇరాన్, దుబాయ్ తదితర దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారు ఆయా ప్రాంతాల దౌత్య కార్యాలయాల మార్గదర్శకాలను పాటించాలని సీఎం సూచించారు. తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ఈ అత్యవసర పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Gulf Telugu Advisory | భారత్​కు తరలించాలి

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారతీయుల రక్షణ, భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను, పరిస్థితులను దౌత్య కార్యాలయాల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, అక్కడ చిక్కుకున్న వారిని భారత్‌కు తరలించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Gulf Telugu Advisory | ఆయిల్​ ట్యాంకర్​పై ఇరాన్​ దాడి

ఒమన్‌ (Oman)లో ఆయిల్‌ ట్యాంకర్‌లపై ఇరాన్‌ దాడులు చేసింది. దాడి సమయంలో ఆయిల్‌ ట్యాంకర్‌లో పలువురు భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో నలుగురికి గాయాలు అయ్యాయి. హర్‌మూజ్‌ జలసంధిలో ఉన్న ఆయిల్‌ ట్యాంకర్‌పై ఇరాన్‌ దాడి చేసింది.

విమానాలు రద్దు

ఢిల్లీ ఎయిర్‌పోర్టు (Delhi Airport)లో 100కు పైగా విమానాలు రద్దు అయ్యియి. ఇరాన్​, ఇజ్రాయెల్​ గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయా దేశాలకు వెళ్లాల్సిన విమానాలు నిలిచిపోయాయి. ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన 60, ఢిల్లీకి రావాల్సిన 40 విమానాలు రద్దు అయినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో పాటు ముంబై, దేశంలోని ఇతర ఎయిర్​ పోర్టుల నుంచి సైతం విమానాలు రద్దు అయ్యాయి.

airport

ఇది కూడా చదవండి : Iran Dubai Doha Attacks | దుబాయ్, దోహాలపై ఇరాన్ దాడులు.. ఆందోళనకరంగా పరిస్థితి

Maize Procurement Centers | మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి : హరీశ్​రావు
Forbes India Billionaires | ఫోర్బ్స్ జాబితాలో భారత్‌కు 3వ స్థానం
Israel Iran Attacks | ఇరాన్​ ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్ దాడులు
RSS Nitya Shakha | ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణానికి ప్రాణం ‘నిత్యశాఖ’
Kukatpally ACB Trap | ఏసీబీకి చిక్కిన కమ్యూనిటీ ఆర్గనైజర్
TAGGED:Dubai newsFlight cancellations IndiaGulf IndiansGulf Telugu SafetyIndian Embassy advisoryIran attackRevanth ReddyTelangana CM
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Madiga Martyrs Day | Madiga Martyrs Day | మాదిగ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
Next Article Holi Police Guidelines | Holi Police Guidelines | హోలీని పురస్కరించుకొని పోలీసు నిబంధనలు పాటించాలి
3 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?