అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gurukul Entrance Results | రాష్ట్రంలో గురుకులాల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (Adluri Lakshman Kumar) రిజల్ట్స్ రిలీజ్ చేశారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఆయా బడుల్లో 6వ తరగతిలో ప్రవేశాల కోసం ప్రభుత్వం టీజీ సెట్ (TG CET 2026) నిర్వహిస్తుంది. ఇటీవల పరీక్ష జరగ్గా తాజాగా ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు నిజామాబాద్ ఆర్సీవో (Nizamabad RCO) సత్యనాథ్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు. గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఫిబ్రవరిలో నిర్వహించారు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
Gurukul Entrance Results | మార్కుల ఆధారంగా..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో టీజీ సెట్ ఫలితాల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. రిజర్వేషన్లు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. విద్యార్థి ర్యాంక్, పాఠశాల ఎంపిక ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం సీట్లను అధికారులు ఖరారు చేస్తారు.
ర్యాంక్‌లు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం సిద్ధం కావాలి. అవసరమైన ధ్రువపత్రాలను రెడీ చేసుకోవాలి. జనన ధ్రువీకరణ పత్రంతో పాటు బోనఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్, కుల ధ్రువీకరణ పత్రాలతో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
దీనిని కూడా చదవండి : ISRO YUVIKA 2026 | విద్యార్థులకు సూపర్ ఛాన్స్.. ఇస్రో ‘యువిక 2026’ రిజిస్ట్రేషన్లు షురూ..

