అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gym Heart Attack Death | జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
ఖమ్మం జిల్లా (Khammam District) కు చెందిన అనిల్ చౌదరి బేగంపేట (Begumpet) లోని సైబర్ హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఆయన నిత్యం జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేస్తాడు. రోజు మాదిరిగానే బుధవారం సాయంత్రం సైతం జూబ్లీహిల్స్ రోడ్‌నంబర్ 36లోని ఈఎస్‌వైబీఓ జిమ్‌కు వెళ్లాడు. గంట సేపు జిమ్ చేసిన తర్వాత అనిల్ వాష్ రూమ్‌కు వెళ్లాడు. అక్కడ కుప్పకూలిపోయాడు.
Gym Heart Attack Death | సీపీఆర్ చేసినా..
అనిల్ కిందపడిపోవడంతో గమనించిన జిమ్ సిబ్బంది వెంటనే సీపీఆర్ చేశారు. 108 కు సమచారం అందించారు. అనంతర ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అనిల్ చౌదరి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Gym Heart Attack Death | భయపెడుతున్న గుండెపోట్లు
దేశంలో ఇటీవల హార్ట్ ఎటాక్‌లు పెరిగాయి. మారుతున్న జీవన శైలితో చిన్నారులు, యువత సైతం హార్ట్ఎటాక్ (Heart attack)తో చనిపోతున్నారు. గతంలో గుండె పోటు వచ్చినా.. బతికేవారు. అయితే ప్రస్తుతం సడెన్ కార్డియాక్ అరెస్ట్‌తో వెంటనే ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పటి వరకు బాగానే ఉన్నవారు ఉన్నట్లుండి కుప్పకూలుతున్నారు. గుండెపోట్లపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నిత్యం వ్యాయామం చేయాలని, మంచి ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. జంక్ ఫుడ్, మద్యపానం, దూమపానానికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Unseasonal Rains Telangana | మళ్లీ అకాల వర్షాలు..

