Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: H J Dora Death | మాజీ డీజీపీ హెచ్​జె దొర మృతి.. సంతాపం తెలిపిన సీఎం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - H J Dora Death | మాజీ డీజీపీ హెచ్​జె దొర మృతి.. సంతాపం తెలిపిన సీఎం

తెలంగాణఆంధ్రప్రదేశ్​

H J Dora Death | మాజీ డీజీపీ హెచ్​జె దొర మృతి.. సంతాపం తెలిపిన సీఎం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ డీజీపీ హెచ్​జె దొర మృతి చెందారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

Srinivas kolluri
Last updated: మార్చి 13, 2026 6:41 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
H J Dora Death

అక్షరటుడే, వెబ్​డెస్క్ : H J Dora Death | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో డీజీపీగా పని చేసిన హెచ్​జె దొర (83) మృతి చెందారు. కొంతకాలంగా ఆయన కిడ్ని సమస్యలతో బాధ పడుతున్నారు. శుక్రవారం నిమ్స్​ ఆస్పత్రి (Nims Hospital)లో డయాలసిస్​ చేయించుకొని ఇంటికి వెళ్లారు. అనంతరం బాత్​రూమ్​లో పడిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు.

Contents
  • H J Dora Death | సీఎం సంతాపం
    • H J Dora Death | ఏపీ సీఎం దిగ్భ్రాంతి

హెచ్​జె దొర (HJ Dora) ఉమ్మడి రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, డీజీపీ (DGP)గా సేవలందించారు. 1943లో శ్రీకాకుళంలో జన్మించిన ఆయన 1965 బ్యాచ్​ ఐపీఎస్​ అధికారి. పోలీస్​ శాఖలో వివిధ హోదాల్లో ఆయన పని చేశారు. 1996 నుంచి 2002 వరకు ఉమ్మడి ఏపీ డీజీపీగా సేవలు అందించారు. ఆ సమయంలో నక్సలైట్లను అణిచి వేయడంలో కీలకంగా వ్యవహరించారు.

H J Dora Death | సీఎం సంతాపం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాజీ డీజీపీ మరణంపై సంతాపం తెలిపారు. దొర కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఉమ్మడి రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. పోలీసు శాఖలో పలు సంస్కరణలను ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించారని, పోలీసులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఆయన విస్తృతంగా కృషి చేశారని ముఖ్యమంత్రి తెలిపారు.

H J Dora Death | ఏపీ సీఎం దిగ్భ్రాంతి

మాజీ డీజీపీ దొర మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ పోలీస్​కు బ్రాండ్​ క్రియేట్​ చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు. నక్సల్ సమస్య పరిష్కారంలో హెచ్ జె దొర ఎంతో సమర్థవంతంగా వ్యవహరించారని కొనియాడారు. హైదరాబాద్​ సీపీ సజ్జనార్​ సైతం ఆయన మృతిపై సంతాపం తెలిపారు. నక్సలిజం తీవ్రంగా ఉన్న సమయంలో ఆయన డీజీపీగా పని చేశారన్నారు.

దీనిని కూడా చదవండి : Telangana LPG Supply | రాష్ట్రంలో గ్యాస్‌ కొరత లేదు.. బ్లాక్​ మార్కెట్​ తరలిస్తే కఠిన చర్యలు : మంత్రి ఉత్తమ్​

RSS Nitya Shakha | ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణానికి ప్రాణం ‘నిత్యశాఖ’
Kavitha Budget Criticism | ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పు.. బడ్జెట్​పై కవిత విమర్శలు
Siddipet Congress Clash | సీఎం పర్యటన వేళ.. సిద్దిపేట కాంగ్రెస్​లో వర్గపోరు
Attapur Hydraa Demolition | అత్తాపూర్​లో హైడ్రా కూల్చివేతలు
Kamareddy Sisters Murder | మహిళా దినోత్సవాన్ని.. ప్రశ్నిస్తున్న పసి హృదయాలు!
TAGGED:Andhra Pradesh police newsChandrababu Naidu reactionFormer AP DGP H J DoraH J Dora deathRevanth Reddy condolences
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Government Degree College Facilities | Government Degree College Facilities | ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెరుగైన విద్యా వసతులు
Next Article Chess for Students | Chess for Students | చెస్ ఆటతో విద్యార్థుల మేధస్సు పెరుగుతుంది..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?