అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hanamkonda Pool Deaths | హన్మకొండ జిల్లా (Hanamkonda District)లో తీవ్ర విషాదం నెలకొంది. ఐనవోలు మండలం పున్నేలు గ్రామం (Punnelu Village)లో ఓ తల్లి, ఇద్దరు కుమార్తెలు స్విమ్మింగ్ పూల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Hanamkonda Pool Deaths | స్విమ్మింగ్ పూల్‌లో మృతదేహాలై..
వివరాల్లోకి వెళ్తే.. పున్నేలు గ్రామానికి చెందిన అజారుద్దీన్, ఫర్హత్ (26) దంపతులు. అయితే వీరికి ఉమేరా (8), ఆయేషా (6) అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా.. అజారుద్దీన్ స్థానికంగా ఓ స్విమ్మింగ్ పూల్ (Swimming Pool) నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే బుధవారం రాత్రి కుటుంబ సభ్యులంతా స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లారు. కాసేపటికే ఫర్హత్, ఆమె ఇద్దరు కూతుళ్లు పూల్‌లో శవాలై తేలినట్లు సమాచారం.
సమాచారం తెలుసుకున్న ఐనవోలు పోలీసులు (Ainavolu Police) ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే భార్యాభర్తల మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కూతురు, మనవరాళ్ల మృతిపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: ACB corruption arrests | ఏసీబీకి చిక్కిన ఏఎస్సై, సీనియర్ అసిస్టెంట్
