Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Handloom Workers Issue | చేనేత కార్మికుల పొట్ట కొడుతున్న ప్రభుత్వం : కవిత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Handloom Workers Issue | చేనేత కార్మికుల పొట్ట కొడుతున్న ప్రభుత్వం : కవిత

తెలంగాణతాజా వార్తలు

Handloom Workers Issue | చేనేత కార్మికుల పొట్ట కొడుతున్న ప్రభుత్వం : కవిత

చేనేత కార్మికుల జీవితాలను ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టేస్తోందని కవిత అన్నారు. టెస్కోకు ఇచ్చిన యూనిఫామ్​ల తయారీ కాంట్రాక్ట్​ను రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 2, 2026 12:01 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 రోజు ago
Share
Handloom Workers Issue

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Handloom Workers Issue | కాంగ్రెస్​ ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం చేనేత కార్మికుల జీవితాలను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Contents
  • Handloom Workers Issue | ఏకపక్షంగా రద్దు
    • Handloom Workers Issue | ప్రైవేట్​ సంస్థ కోసం..

టెస్కో(తెలంగాణ చేనేత సహకార సంఘం)కి విద్యాశాఖ అధికారులు షాక్​ ఇచ్చిన విషయం తెలిసిందే. 2026-27 విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యార్థుల యూనిఫామ్​ల తయారీకి గతంలో టెస్కోకు అధికారులు ఆర్డర్​ ఇచ్చారు. రూ.105.54 కోట్ల ఆర్డర్‌ను తాజాగా రద్దు చేశారు. దీంతో నేత కార్మికుల ఉపాధిపై ప్రభావం పడనుంది. ప్రభుత్వ నిర్ణయంపై కవిత ఎక్స్​ వేదికగా స్పందించారు.

Handloom Workers Issue | ఏకపక్షంగా రద్దు

విద్యార్థులకు యూనిఫాంలు కుట్టించి ఇచ్చే ఆర్డర్​ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) పర్యవేక్షిస్తున్న విద్యాశాఖ ఏకపక్షంగా రద్దు చేసిందని కవిత విమర్శించారు. రూ.105 కోట్ల విలువైన టెండర్ రద్దు కావడంతో 393 చేనేత సహకార సంఘాల్లోని వేలాది మంది చేనేత కార్మికులకు ఉపాధి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ శాఖలు, ఇతర డిపార్ట్మెంట్లు సైతం రూ.200 కోట్ల విలువైన దుప్పట్లు, ఇతర దుస్తుల పంపిణీకి గడువు ముగిసినా టెస్కోకు ఆర్డర్ ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు.

Handloom Workers Issue | ప్రైవేట్​ సంస్థ కోసం..

విద్యాశాఖ ఉన్న ఆర్డర్ రద్దు చేసి.. టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోందని కవిత అన్నారు. ఏదో ఒక సంస్థకు మేలు చేయడానికి వేలాది చేనేత కార్మిక కుటుంబాల పొట్టకొట్టే కాంగ్రెస్ ప్రభుత్వ (Congress government) కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని ఆమె హెచ్చరించారు. విద్యార్థుల యూనిఫాంలు సహా ప్రభుత్వ శాఖల టెండర్లు టెస్కోకు ఇచ్చే వరకు చేనేత కార్మికులతో కలిసి ఉద్యమిస్తామన్నారు.

ఇది కూడా చదవండి..: Kazipet Railway Division | కాజీపేట రైల్వే డివిజన్​ ఏర్పాటు చేయాలి : కేటీఆర్​

Mahindra XUV 9E CineLux | లగ్జరీ ఫీచర్లతో ‘సినీలక్స్’ లాంచ్.. బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా
Fake Dentist Arrest | పదో తరగతి పాస్​ కాకుండానే డాక్టర్​గా.. నకిలీ వైద్యుడి అరెస్ట్​
New DGP Selection | కొత్త డీజీపీ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు.. రేసులో వీరే..
QNet Fraud Raids | ఎంఎల్​ఎం సంస్థ క్యూనెట్​పై సీసీఎస్​ దాడులు
Anganwadi Breakfast Scheme | అంగన్​వాడీ చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం
TAGGED:government tenders Indiahandloom workers IndiaHandloom Workers IssueKavitha NewsTelangana PoliticsTESKO Telanganatextile industry Indiauniform contract issueweavers livelihood crisis
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hanuman Jayanti Temples | Hanuman Jayanti Temples | ఆలయాల్లో మారుమోగుతున్న జైహనుమాన్​ నామస్మరణ..
Next Article Fertilizer Import Duty Removal Fertilizer Import Duty Removal | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎరువుల దిగుమతులపై సుంకాలు రద్దు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?