అక్షరటుడే, కామారెడ్డి : Hanuman Jayanti Celebrations | హనుమాన్ జయంతిని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అన్నారు. ఏప్రిల్ 2వ తేదీన హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పట్టణంలో నిర్వహించనున్న శోభాయాత్ర మార్గాన్ని, ఏర్పాట్లను ఎస్పీ రాజేష్ చంద్ర (District SP Rajesh Chandra)తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు.
Hanuman Jayanti Celebrations | ర్యాలీ సజావుగా.. శాంతియుత వాతావరణంలో..
ర్యాలీ సజావుగా, శాంతియుత వాతావరణంలో జరిగేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులతో చర్చించి కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు. ప్రధాన కూడళ్లను సందర్శించి ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. ర్యాలీ నిర్వహణ ప్రతినిధులతో కామారెడ్డి (Kamareddy) టౌన్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించి వేడుకలను క్రమశిక్షణతో జరుపుకోవాలని సూచించారు.
Hanuman Jayanti Celebrations | కట్టుదిట్టమైన భద్రత నడుమ..
ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ.. పట్టణంలోని ముఖ్య మార్గాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలు, సీసీటీవీల ద్వారా నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా భక్తులు నిర్వాహకులు పోలీస్ శాఖ (Police Department) కు సహకరించి ఈ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, కామారెడ్డి పట్టణ సీఐ నరహరి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Sare caught in bike | జాతీయ రహదారిపై విషాదకర ఘటన.. చీరకొంగు బైక్‌లో చిక్కుకుని మహిళ మృతి
